Homeగాసిప్స్బ్ర‌హ్మానందం సంచ‌ల‌న నిర్ణ‌యం?

బ్ర‌హ్మానందం సంచ‌ల‌న నిర్ణ‌యం?

బ్ర‌హ్మానందం సంచ‌ల‌న నిర్ణ‌యం?
బ్ర‌హ్మానందం సంచ‌ల‌న నిర్ణ‌యం?

చిన్ని సినిమాల్లో కీల‌క పాత్ర‌ల నుంచి స్టార్ హీరోల చిత్రాల్లో ప్ర‌త్యేక పాత్ర‌ల వ‌ర‌కు బ్ర‌హ్మానందం వుండాల్సిందే. ఒక ద‌శ‌లో బ్ర‌హ్మానందం లేని స్టార్ హీరో సినిమా లేదంటే అది అతిశ‌యోక్తి కాదేమో. అంత‌గా బిజీగా వుంటూ భారీ స్టార్ క‌మెడియ‌న్‌గా రికార్డు స్థాయి పారితోషికాన్ని తీసుకున్న ఆయ‌న గ‌త కొంత కాలంగా త‌న జోరు త‌గ్గించారు. పెద్ద‌గా సినిమాలు చేయ‌డం లేదు.

ఇటీవ‌ల ఆయ‌న‌కు స్టంట్స్ వేయ‌డంతో సినిమాల‌కు మ‌రింత దూరంగా వుంటున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `రాములో రాములా….` పాట‌లో గెస్ట్ అప్పియ‌రెన్స్ ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేసిన బ్ర‌హ్మానందం ఆ త‌రువాత మ‌రో చిత్రంలో క‌నిపించ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న వెండితెర‌కు గుడ్‌బై చెప్ప‌బోతున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

- Advertisement -

వెండి తెర‌కు గుడ్‌బై చెప్పి బుల్లితెర‌పై బ్ర‌హ్మానందం మెర‌వాల‌నుకుంటున్నార‌ట‌. ఇప్ప‌టికే ఓ టాక్ షో తో పాటు ఓ డైలీసీరియ‌ల్‌ని ఆయ‌న ఓకే చేసిన‌ట్టు ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. బ్ర‌హ్మానందం ఉన్న‌ట్టుండి ఇలాంటి నిర్ణ‌యం తీసుకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఆయ‌న ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డ‌మేన‌ని చెబుతున్నారు. సినిమాల్లో న‌టించి స్టెయిన్ అయ్యేకంటే సీరియ‌ల్స్ చేయాల‌ని భావిస్తున్న‌ర‌ట‌.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All