Homeన్యూస్తనపై మీమ్స్ చేసే వాళ్లపై బ్రహ్మానందం రియాక్షన్..!

తనపై మీమ్స్ చేసే వాళ్లపై బ్రహ్మానందం రియాక్షన్..!

Brahmanandam Reaction about his memes

నవ్వుల రాజు.. హాస్య బ్రహ్మ.. కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం అలితో సరదాగా షోలో పాల్గొన్నారు. అలి యాంకర్ గా చేస్తున్న ఈ షోకి బ్రహ్మానందం గెస్ట్ గా రావడం విశేషం. వీరిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికి తెలిసిందే. అందుకే షో సూపర్ గా వచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ షోకి సంబందించిన ప్రోమో ఒకటి రిలీజ్ చేశారు. అందులో తను సినిమాలు చేయకపోయినా సరే తనపై మీమ్స్ వేస్తున్న వారికి తన కృతజ్ఞతలు తెలిపారు బ్రహ్మానందం.

- Advertisement -

తనని అలా ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తున్న మీమ్స్ క్రియేటర్స్ కు తన ధన్యవాదాలు తెలిపాడు బ్రహ్మానందం. ఇక ఎప్పుడైనా ఏదైనా సన్మానం జరిగితే ఆరోజు ఇంటికెళ్లి నేల మీద పడుకుంటానని చెప్పి షాక్ ఇచ్చారు. ఆంతేకాదు లెక్చరర్ గా ఉన్న బ్రహ్మానందం కమెడియన్ గా ఎలా మారాడు. ఆయన కెరియర్ లో మొదటి అవకాశం ఎలా వచ్చింది ఇలాంటి విషయాలన్ని ఆయన ఇంటర్వ్యూలో చర్చించారు.

ఈటీవీలో సక్సెస్ షోగా నడుస్తున్న అలితో సరదాగా షోలో బ్రహ్మానందం ఎపిసోడ్ చాలా స్పెషల్ అని చెప్పొచ్చు. ఈ ఎపిసోడ్ కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All