Homeటాప్ స్టోరీస్బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్

బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్

బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్
బ్రహ్మానందం బర్త్ డే స్పెషల్

ఒక మనిషి,35 సంవత్సరాల నట జీవితం, 5 నంది అవార్డులు, వెయ్యికిపైగా సినిమాలు, గిన్నిస్ రికార్డులో పేరు నమోదు… బ్రహ్మానందం అనే వ్యక్తి గురించి చెప్పడానికి కేవలం వివరాలు మాత్రమే సరిపోదు. ఆరోగ్యకరమైన హాస్యంతో మొదలై అప్పుడప్పుడు ఎమోషనల్ క్యారెక్టర్లు కూడా వేస్తూ, అడపాదడపా వేదికలపై అద్భుతమైన ఉపన్యాసాలు ఇస్తూ, ఒక బహుముఖ ప్రజ్ఞాశాలిగా తక్కువగా… హాస్యనటుడిగా ఎక్కువగా ప్రజల మనసులలో రిజిస్టర్ అయిన వ్యక్తి బ్రహ్మానందం గారు.

“ఎర్రటి ఎండలో వేడి నీళ్ళు పోసుకొని.. రగ్గు కప్పుకుని తిరిగేవాడి మొహం నువ్వునూ..! పోతావ్ రేయ్… నాశనం అయిపోతావ్” అంటూ, ఆయన ఏ ముహూర్తంలో అరగుండు పాత్రతో తెలుగు తెరపై అరంగేట్రం చేసాడో, అప్పటినుంచి ఇప్పటివరకు నాన్ స్టాప్ గా మనల్ని నవ్విస్తూనే ఉన్నాడు. బ్రహ్మానందం నవ్వినా, ఏడ్చినా, కోప్పడినా, చికాకు పడినా, వెటకారంగా చేసినా.. ఇలా ఏం చేసినా ప్రజలు అందులో నవ్వుని వెతుక్కున్నారు. ఎంటర్టైన్మెంట్ గేమ్ షోలతో హాస్యం అనేది పల్చబడిపోయిన ఈ రోజుల్లో కూడా, బ్రహ్మానందం అనే వ్యక్తి వెండితెర మీద లేదా బుల్లితెర మీద గాని కేవలం రెండు సెకండ్ల పాటు కనిపిస్తేచాలు.. ప్రేక్షకుల మొహంలో చిరునవ్వు వచ్చేస్తుంది. కేవలం కామెడీనే కాకుండా, ఆయనలోని నటుణ్ని అన్నిరకాలుగా మనకు చూపించే ఎన్నో రకాల పాత్రలు కూడా వేశాడు. ఆయన చేసిన “బాబాయ్ హోటల్” సినిమా చిన్న ఉదాహరణ. ఒక్కమాటలో చెప్పాలంటే బ్రహ్మానందం గారు తెలుగు సినిమాలో కమెడియన్ గా రిజిస్టర్ అవ్వడం మన దురదృష్టం.

- Advertisement -

ఇప్పటికీ అనేక మంది దర్శక నిర్మాతలు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చే సీన్ లో ఎటువంటి డైలాగులు రాయాలి అనే సందేహం వచ్చినప్పుడు పేపర్ ఖాళీగా బ్రహ్మానందం గారికి ఇస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయనలో ఉన్న సెన్సాఫ్ హ్యూమర్, ఆన్ స్పాట్ క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎవరి లోనూ ఉండవు. ఇక కొన్ని కారణాల వల్ల ఆయనతో ఇబ్బందులు పడ్డ దర్శక నిర్మాతలు “ఆయనకు అహంకారం ఎక్కువ..!” అని ప్రచారం చేసినా బ్రహ్మానందం లాంటి వాడికి “ఆ మాత్రం అహంకారం కూడా.. అలంకారమే” అని ప్రేక్షకులు అసలు పట్టించుకోలేదు. కచ్చితంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రాజబాబు గారి తర్వాత హాస్య చక్రవర్తి గా నిలిచిపోయే గొప్ప వ్యక్తి బ్రహ్మానందం గారు. ఆయనకు మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All