Homeటాప్ స్టోరీస్అఖిల్ ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్

అఖిల్ ని రిజెక్ట్ చేసిన డైరెక్టర్

Boyapati srinu not intrested with Akhil అక్కినేని అఖిల్ హీరోగా నిలదొక్కుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు . అఖిల్ సోలో హీరోగా నటించిన మొదటి సినిమా అఖిల్ డిజాస్టర్ కాగా రెండో సినిమా హలో యావరేజ్ గానే మిగిలింది . ఇక ఇప్పుడేమో మిస్టర్ మజ్ను అంటూ వస్తున్నాడు . అయితే మాస్ దర్శకులు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖిల్ నటిస్తే అతడి రేంజ్ మారుతుందని భావించాడట నాగార్జున . కానీ బోయపాటి శ్రీను మాత్రం అఖిల్ తో సినిమా చేసే ఉద్దేశం లేనట్లు చెప్పాడు . అఖిల్ తో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి కానీ అటువంటిదేమీ లేదని ప్రస్తుతం నా ద్రుష్టి అంతా చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామ చిత్రం పైనే ఉందని స్పష్టం చేసాడు బోయపాటి శ్రీను .

అంటే బోయపాటి మాటల ప్రకారం అఖిల్ తో సినిమా చేసే ఉద్దేశం అయితే లేదు . అయితే మిస్టర్ మజ్ను పై అఖిల్ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు . ఆ సినిమా తర్వాత అభిమన్యుడు దర్శకుడు మిత్రన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయాలనే ఆలోచన చేస్తున్నాడు . మనం చిత్రంలో కేవలం అయిదు నిముషాలు కనిపించి మేజిక్ చేసిన అఖిల్ పూర్తిస్థాయి హీరోగా మాత్రం సక్సెస్ అందుకోలేక పోతున్నాడు . మరి మిస్టర్ మజ్ను ఏం చేస్తుందో చూడాలి .

- Advertisement -

English Title: Boyapati srinu not intrested with Akhil

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All