Homeటాప్ స్టోరీస్రియా అరెస్ట్‌.. బాలీవుడ్ కొత్త స్లోగ‌న్‌!

రియా అరెస్ట్‌.. బాలీవుడ్ కొత్త స్లోగ‌న్‌!

రియా అరెస్ట్‌.. బాలీవుడ్ కొత్త స్లోగ‌న్‌!
రియా అరెస్ట్‌.. బాలీవుడ్ కొత్త స్లోగ‌న్‌!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు చుట్టూ నాట‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సుశాంత్ మృతికి డ్ర‌గ్స్‌కి సంబంధం వుండ‌టం, రియాకు డ్ర‌గ్ డీల‌ర్‌ల‌తో సంబంధం వుండ‌టంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. రాకెట్ స్పీడుతో విచార‌ణ మొద‌లుపెట్టింది. డ్ర‌గ్స్ పెడ్ల‌ర్స్‌తో సంబంధాలున్నాయ‌న్న అరోప‌ణ‌ల నేప‌థ్యంలో రియా సోద‌రుడు షోవిక్‌ని అరెస్ట్ చేసింది. ఆ వెంట‌నే రియాని విచారించ‌డం మొద‌లుపెట్టిన ఎన్‌సీబీ అధికారులు మూడు రోజుల పాటు విచారించి కీల‌క సమాచారం రాబ‌ట్టిన‌ట్టు తెలిసింది.

దీంత రియాను మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. దీంతో బాలీవుడ్ భ‌గ్గుమంది. రియాను కావాల‌నే ఈ కేసులో ఇరికిస్తున్నార‌ని, మ‌నాసికంగా వేధిస్తున్నార‌ని బాలీవుడ్ మండి ప‌డ‌టం మొద‌లుపెట్టింది. విచార‌ణ సంద‌ర్భంగా హాజ‌రైన రియా బ్లాక్ టీష‌ర్ట్‌పై వున్న స్లోగ‌న్‌ని సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూ కొత్త స్లోగ‌న్ అందుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

- Advertisement -

రియాను ఓ మంత్ర గ‌త్తెను వెంటాడుతున్న‌ట్టు వెంటాడుతున్నార‌ని రియాకు సోన‌మ్ క‌పూర్ మ‌ద్దుతుగా నిలిచింది. #JusticeForRhea హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. రియాకు మ‌ద్ద‌తుగా నిలిచిన వారిలో విద్యాబాల‌న్‌, అనురాగ్ క‌శ్య‌ప్‌, దియా మీర్జా, పుల్కిత్ స‌మ్రాట్ వంటి వారున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All