Homeన్యూస్అరియానాకి ఐలవ్యూ చెప్పిన బిగ్ బాస్ కంటెస్టంట్..!

అరియానాకి ఐలవ్యూ చెప్పిన బిగ్ బాస్ కంటెస్టంట్..!

BiggBoss Contestant said I Love You for Ariana

బిగ్ బాస్ సీజన్ 5 నుండి హెల్త్ ప్రాబ్లెమ్స్ వల్ల నామినేషన్స్ లో లేకపోయినా సరే హౌజ్ నుండి బయటకు వచ్చాడు జశ్వంత్ అలియాస్ జెస్సీ. హౌజ్ లో ఉన్నన్నాళ్లు కూల్ అండ్ కాం బోయ్ గా అనిపించిన జెసీ ఈమధ్య కొద్దిగా తనలోని నాటీ యాంగిల్ బయట పెడుతున్నాడు. ఈ క్రమంలో ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చిన జెస్సీ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో షాక్ ఇచ్చాడు. ఈ సీజన్ బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూస్ చేస్తున్న అరియానాకి ఐలవ్యూ చెప్పి షాక్ ఇచ్చాడు జెస్సీ. చూడగానే నచ్చేశారని అందుకే ఐలవ్యూ అంటూ చెప్పాడు జెస్సీ.

- Advertisement -

అరియానా అతను చేసిన ప్రపోజల్ కు షాక్ అయ్యింది. చూడటానికి అలా ఉంటావ్ కాని నువ్వు చాలా ముదురే అనేలా అరియానా జెస్సీ మీద కామెంట్స్ చేసింది. ఇక ఇంటర్వ్యూలో భాగంగా హౌజ్ లో ఒక్కొక్కరి గురించి చెబుతూ జెస్సీ తన కామెంట్స్ చెప్పాడు. ఇక తన బ్యాచ్ అయిన షణ్ముఖ్, సిరిలను మరోసారి పైకిలేపాడు జెస్సీ.

మోడల్ గా అంతకుముందు ఎవరికి తెలియని జెస్సీ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా అందరికి సుపరిచితుడు అయ్యాడని చెప్పొచ్చు. బిగ్ బాస్ వల్ల జెస్సీకి మంచి ఫాలోయింగ్ వచ్చిందని చెప్పొచ్చు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All