Homeన్యూస్ప్రియ వర్సెస్ లోబో.. నాల్గవ వారం నామినేషన్స్ బిగ్ బాస్ లో రచ్చ..!

ప్రియ వర్సెస్ లోబో.. నాల్గవ వారం నామినేషన్స్ బిగ్ బాస్ లో రచ్చ..!

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో నాల్గవ వారం నామినేషన్స్ రచ్చ షురూ అయినట్టు తెలుస్తుంది. సోమవారం వచ్చింది అంటే బిగ్ బాస్ హౌజ్ లో నామినేషన్స్ జరుగుతాయన్న విషయం తెలిసిందే. శని, ఆది వారాల్లో నాగార్జున ఎపిసోడ్ కోసం ఆడియెన్స్ ఎంత ఎక్సయిటింగ్ గా ఉంటారో.. సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్ గురించి కూడా ఆడియెన్స్ అంతే ఈగర్ గా ఎదురుచూస్తుంటారు. ఇక ఎప్పటిలానే ఈ వారం నామినేషన్స్ కూడా హౌజ్ మేట్స్ మధ్య గొడవలతో జరిగినట్టు తెలుస్తుంది.

ముఖ్యంగా లాస్ట్ వీక్ లహరితో గొడవ పడ్డ ప్రియ ఈ వారం లోబోతో అదే సీన్ రిపీట్ చేసినట్టు ఉంది. లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో లోబో లవ్ స్టోరీ విని సినిమా కథ చెప్పాడని ప్రియ అనగా దానికి హర్ట్ అయిన లోబో ఆమెని నామినేట్ చేశాడు.అంతేకాదు ప్రియ మాట్లాడుతుంటే ఆమె మీద అరిచి మరి తను చెప్పాలనుకున్నది చెప్పాడు. లోబో ఫైర్ మీద ఉన్న టైం లో యాంకర్ రవి వచ్చి కొద్దిగా కూల్ చేయాలని చూశాడు. ఆ టైం లో లోబో బోరున ఏడవడం జరిగింది.

- Advertisement -

సో ఈ వారం నామినేషన్స్ లో కూడా ప్రియనే హాట్ టాపిక్ గా నిలిచేలా ఉంది. ఇక ప్రోమోలో శ్రీరాం చంద్ర, శ్వేత వర్మల మధ్య కూడా హీటెడ్ డిస్కషన్ జరిగినట్టు తెలుస్తుంది. మరి ఈ వారం నామినేషన్స్ లో ఎవరెవరు ఉంటారో చూడాలి.

 

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All