Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ 5: వాడి వేడిగా సాగిన నామినేషన్స్

బిగ్ బాస్ 5: వాడి వేడిగా సాగిన నామినేషన్స్

 

bigg boss 5 nominations turns up the heat 
bigg boss 5 nominations turns up the heat

బిగ్ బాస్ 5 రియాలిటీ షోలో ఆదివారం సరయు మొదటగా ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే. ఇక నిన్న సోమవారం నాడు నామినేషన్స్ డే కావడంతో అత్యంత ఆసక్తికరంగా సాగాయి. మొదటగా బిగ్ బాస్ టీమ్ ఈగిల్స్, టీమ్ వోల్ఫ్ అంటూ ఉన్న కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా డివైడ్ చేసారు. హౌజ్ మేట్స్ అందరూ ఇది ఏదో టాస్క్ కోసం అనుకున్నారు కానీ చిన్న ట్విస్ట్ ఇస్తూ ఇది నామినేషన్స్ కోసమని, అవతలి టీమ్ లో ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుందని బిగ్ బాస్ తెలిపారు.

- Advertisement -

అయితే ఈ ప్రక్రియ మొత్తం వాడివేడిగా జరిగింది. ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడం, ఉమా అయితే దారుణమైన భాషను వాడటం జరిగింది. ఇక శ్వేతా వర్మ నామినేషన్ ప్రక్రియలో కొన్ని మంచి పాయింట్స్ మాట్లాడినా కానీ ఆ తర్వాత హమీదను నామినేట్ చేస్తూ చాలా రూడ్ గా ప్రవర్తించింది. లోబో రవితో తన ఫ్రెండ్ షిప్ ను కట్ చేసుకున్నట్లు తెలిపాడు. అలాగే లోబో కట్టిన ఫ్రెండ్ షిప్ బ్యాండ్ ను శ్వేతా వర్మ విసిరికొట్టింది.

మొత్తానికి ఈ వారం నామినేషన్స్ లో ఉమా, కాజల్, ప్రియా, ప్రియాంక, లోబో, అన్నీ, నటరాజ్ లో ఉన్నారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All