Homeటాప్ స్టోరీస్బిగ్ బాస్ లో పాల్గొంటే సినిమా ప్లాపే !

బిగ్ బాస్ లో పాల్గొంటే సినిమా ప్లాపే !

Bigg Boss 2 Telugu a flop show for moviesబిగ్ బాస్ 2 షోలో తమ సినిమా ప్రమోషన్ కోసం ఎవరైనా పాల్గొంటే ఆ సినిమా డిజాస్టర్ అవ్వడం ఖాయం , ఇది నమ్మలేకున్నా నిజమని ఇప్పటివరకు షోలో పాల్గొన్న వాళ్ళని బట్టి తెలుస్తోంది . బిగ్ బాస్ 2 షో లో పాల్గొని తమ సినిమాకు ప్రమోషన్ కు ఉపయోగపడుతుందని ఇప్పటివరకు చాలామంది ప్లాన్ చేసారు అయితే ఇప్పటివరకు వెళ్లిన అన్ని సినిమా వాళ్ళు షాక్ అయ్యే నిజం ఏంటంటే అలా షోలో పాల్గొన్న వాళ్ళ సినిమాలు డిజాస్టర్ అయ్యాయి . నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 2 లో ఇప్పటివరకు మూడు సినిమాల వాళ్ళు షోలో పాల్గొనగా ఆ మూడు సినిమాలు కూడా అట్టర్ ప్లాప్ అయ్యాయి .

కమెడియన్ శ్రీనివాసరెడ్డి హీరోగా నటించిన ” జంబలకిడిపంబ ” సినిమా కోసం శ్రీనివాసరెడ్డి అలాగే వెన్నెల కిషోర్ పాల్గొన్నారు సినిమా చాలా బాగా వచ్చిందని , ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తొందని అన్నారు కట్ చేస్తే అది డిజాస్టర్ అయ్యింది . ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన ” తేజ్ ఐ లవ్ యు ” సినిమా కోసం బిగ్ బాస్ హౌజ్ లోకి అడుగుపెట్టాడు కట్ చేస్తే ఆ సినిమా కూడా ఘోరాతి ఘోరంగా దెబ్బకొట్టింది . ఇక ఇటీవలే మంచు లక్ష్మి తన ” వైఫ్ ఆఫ్ రామ్ ” సినిమా కోసం బిగ్ బాస్ 2 హౌజ్ లోకి అడుగుపెట్టింది . సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందని చెబుతుంది కూడా కానీ గ్రౌండ్ రిపోర్ట్ మాత్రం దారుణంగా ఉంది వైఫ్ ఆఫ్ రామ్ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్ లలో ప్రేక్షకులు లేక ఈగలు తోలుకుంటున్నారు . ఇలా మూడు సినిమాల వాళ్ళు కూడా బిగ్ బాస్ ని ఆశ్రయించి దెబ్బ తిన్నారు దాంతో బిగ్ బాస్ హౌజ్ కి మరక అంటుకుంది .

- Advertisement -

English Title: Bigg Boss 2 Telugu a flop show for movies

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All