Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్‌4: ‌టాప్ 5లో వుండేది వీరేనా?

బిగ్‌బాస్‌4: ‌టాప్ 5లో వుండేది వీరేనా?

బిగ్‌బాస్‌4: ‌టాప్ 5లో వుండేది వీరేనా?
బిగ్‌బాస్‌4: ‌టాప్ 5లో వుండేది వీరేనా?

బిగ్‌బాస్ సీజ‌న్ ‌4 ఎండ్ టైమ్ ద‌గ్గ‌ర‌ప‌డుతోంది. డిసెంబ‌ర్ మూడ‌వ వారంలో ఈ షో ఫైన‌ల్‌కు చేర‌బోతోంది. డిసెంబ‌ర్ 20న గ్రాండ్ ఫినాలే జ‌ర‌గ‌బోతోంది. దీంతో టాప్ 5లో ఎవ‌రుంటార‌నే చ‌ర్చ మొద‌లైంది. ఎలిమినేష‌న్ కూడా చివ‌రి అంకానికి చేర‌డంతో టాప్ 5 ఎవ‌ర‌న్న‌ది మ‌రింత ఆస‌క్తిగా మారింది. హౌస్ నుండి త్వ‌ర‌లో ముగ్గురు స‌భ్యులు  బ‌య‌టికి రాబోతోతున్నారు. ప్ర‌స్తుతం హౌస్‌లో అభిజీత్‌, అఖిల్‌, హారిక‌, లాస్య‌, సోహైల్‌, మోనాల్‌, అవినాష్‌, అరియానా వున్నారు.

ఈ ఎనిమిది మంది స‌భ్యుల్లో అఖిల్ ఇప్ప‌టికే సీక్రెట్ హౌస్‌లోకి వెళ్లి తిరిగొచ్చాడు. ఇత‌ను టాప్ 5లో వుండే అవ‌కాశం లేద‌ని తెలుస్తోంది. ఇక లాస్య‌, మోనాల్ కూడా టాప్ 5లో వుండే అవ‌కాశం లేద‌ని చెబుతున్నారు. టాస్క్‌ల‌లో వీరు సోసోగా ఆడుతున్నారు. ఓటింగ్ కూడా చాలా పూర్‌గా వుంది. మోనాల్‌ని మాత్రం బిగ్‌బాస్ సేవ్ చేస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. ఫైన‌ల్ ద‌గ్గ‌ర‌ప‌డుతున్ననేప‌థ్యంలో ఈ వారం ఎలిమినేష‌న్ ప్ర‌క్రియ మ‌రింత సీరియ‌స్‌గా సాగే అవ‌కాశం వుంద‌ని తాజా ట్రెండ్స్‌ని బ‌ట్టి తెలుస్తోంది.

- Advertisement -

అఖిల్‌, లాస్య‌, మోనాల్ రానున్న రోజుల్లో హౌస్ నుంచి బ‌య‌టికి రానున్నార‌ట‌. హౌస్ నుండి వీరు వెళ్లిపోతే మిగిలే స‌భ్యులు అభి, హారిక‌, సోహైల్‌, రియానా, అవినాష్. వీరే టాప్ 5లో వుండ‌బోతున్నార‌న్న‌ది తాజా ట్రెండ్స్‌ని బ‌ట్టి తెలుస్తోంది. ఈ టాప్ 5లో టైటిల్‌ని గెలిచి విజేత‌గా నిలిచేది మాత్రం అభిజీత్ అని ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. గ‌త వారం నుంచి జ‌రుగుతున్న ప‌రిణామాల‌ని బ‌ట్టి చూస్తే అభీనే బిగ్‌బాస్ 4 విన్న‌ర్ అని చెబుతున్నారు. ఇది ఎంత వ‌ర‌కు నిజ‌న్న‌ది తెలియాలంటే డిసెంబ‌ర్ 20 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All