Homeగాసిప్స్బిగ్‌బాస్‌4:  విన్న‌ర్ ఎవ‌రో డిసైడ్ అయ్యిందా?

బిగ్‌బాస్‌4:  విన్న‌ర్ ఎవ‌రో డిసైడ్ అయ్యిందా?

బిగ్‌బాస్‌4:  విన్న‌ర్ ఎవ‌రో డిసైడ్ అయ్యిందా?
బిగ్‌బాస్‌4:  విన్న‌ర్ ఎవ‌రో డిసైడ్ అయ్యిందా?

బిగ్‌బాస్ సీజ‌న్ ‌4 విన్న‌ర్ ఎవ‌రో డిసైడ్ అయ్యిందా అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గ‌డిచిన ఎపిసోడ్‌ల‌ని బ‌ట్టి చూస్తే సీజ‌న్ 4 విన్న‌ర్ అభిజీత్ అని క్లియ‌ర్ అయిపోయింది. సీజ‌న్ స్టార్టింగ్‌లో అభిజీత్ అంత‌గా ప్ర‌భావం చూపించ‌లేక‌పోయినా రోబో టాస్క్ నుంచి త‌నదైన పంథాలో ఆక‌ట్టుకోవ‌డం మొద‌లు పెట్టాడు. హౌస్‌లో ట్రయాంగిల్ ల‌వ్‌స్టోరీస్‌ని న‌డుపుతూ వీవ‌ర్స్‌కి హాట్ ఫేవ‌రేట్‌గా మారిపోయాడు.

స్మార్ట్‌గేమ్‌తో పాటు ప‌క్కా మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తూ కంటెస్టెంట్‌ల బంధువులు, బ్ర‌ద‌ర్స్‌, మ‌ద‌ర్స్‌కి కూడా ఫేవ‌రేట్‌గా మారిపోయాడు. ఇటీవ‌ల షోలో పాల్గొన‌డానికి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్‌ల ఫ్యామిలీ మెంబ‌ర్స్ అత్య‌ధిక శాతం అభిజీత్‌ని ఫేవ‌రేట్ కంటెస్టెంట్‌గా ప్ర‌క‌టించ‌డంతో మిగ‌తా స‌భ్యులు షాక్ కు గుర‌య్యారు. నిత్యం హౌస్‌లో గ‌డ‌వ‌ప‌డే అఖిల్‌, అభీని ప‌క్క‌న పెట్టిన మోనాల్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ అభిజీత్‌ని హాట్ ఫేవ‌రేట్‌గా స్వ‌యంగా వారి ముందే చెప్ప‌డంతో అభిజీత్ ఏ స్థాయిలో పాపులారిటీని సాధించి ముందు వ‌రుస‌లో నిలిచాడో స్ప‌ష్ట‌మైంది.

- Advertisement -

సోమ‌వారం రాత్రి జ‌రిగిన ఎలిమినేషన్ రౌండ్‌లో డేంజ‌ర్ జోన్‌కి వెళ్లిన అభిజీత్‌ని మోనాల్‌తో స్వైప్ చేసి అభిని సేఫ్ జోన్‌లోకి ఇంటి కెప్టెన్ హారిక తీసుకురావ‌డంతో బిగ్‌బాస్ విన్న‌ర్ అభిజీత్ అని తేలిపోయింది. ఈ ప్ర‌క్రియ‌లో భాగంగా అభీని సేవ్ చేసే క్ర‌మంలో హారిక చెప్పిన మాట‌లు కూడా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. నీ కోసం ఎవ‌రూ లేని స‌మ‌యంలో తానుంటాన‌ని ఈ సంఘ‌ట‌న‌తో నిరూపించాన‌ని హారిక చెప్పిన తీరుకు వీరిద్ద‌రి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ఈ వారం నామినేష‌న్ ప్ర‌క్రియ నుంచి అభీ సేఫ్ కావ‌డం .. ఇదే స‌మ‌యంలో డేంజ‌ర్ జోన్‌లోకి అఖిల్, అవినాష్‌, అరియానా, మోనాల్ వెళ్ల‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All