Homeటాప్ స్టోరీస్బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి పాజిటివ్‌?

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి పాజిటివ్‌?

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి పాజిటివ్‌?
బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్‌కి పాజిటివ్‌?

గ‌త కొన్ని రోజులుగా బిగ్ బాస్ సీజ‌న్ 4 చుట్టే చ‌ర్చ జరుగుతోంది. సీజ‌న్ 3ని మించి సీజ‌న్ 4 వుండ‌నుంద‌నే ఊహాగానాల నేప‌థ్యంలో సీజ‌న్ 4 ప ప్ర‌తీ ఒక్క‌రూ ఆస‌క్తిని చూపిస్తున్నారు. పైగా కోవిడ్ ప్ర‌బ‌లుతున్న ఈ ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో సీజ‌న్ 4ని ఎలా నిర్వ‌హించ‌బోతున్నారా అని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఇందుకు అనుగునంగానే బిగ్‌బాస్ టీమ్ ఏర్పాట్ల‌ని ముమ్మ‌రం చేసింది. ఈ సీజ‌న్ కోసం 16 మంది కంటెస్టెంట్‌ల‌ని ఎంపిక చేసిన మేక‌ర్స్ వారంద‌రికీ తాజాగా కోవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి నెగెటివ్ అని నిర్థార‌ణ అయ్యాక‌ ఓ ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో వుంచార‌ట‌.

అయితే తాజాగా అందులో ఒక‌రికి పాజిటివ్ అని తేల‌డం బిగ్‌బాస్ మేక‌ర్ల‌ని క‌ల‌వరానికి గురిచేస్తోంద‌ని ఓ వార్త ఫిల్మ్ స‌ర్కిల్స్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ప్ర‌స్తుతం ఆ కంటెస్టెంట్‌కి బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ప్ర‌త్యేక చికిత్స అందిస్తున్నార‌ట‌. కాగా షో ప్రారంభం వ‌ర‌కు స‌ద‌రు కంటెస్టెంట్‌కి నెగెటివ్ అని నిర్ధార‌ణ అవుతుందా? లేదా అన్న‌ది మేక‌ర్స్‌ని క‌ల‌వ‌రానికి గురిచేస్తోంద‌ట‌.

- Advertisement -

బిగ్‌బాస్ సీజ‌న్ 4 నాగ్ పుట్టిన రోజైన ఈ నెల 29న లేదా 30న ప్రారంభం కానుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కింగ్ నాగార్జున హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. ఇప్ప‌టికే మూడు ప్రోమోల‌ని వ‌దిలారు. మొద‌టి ప్రోమోలో నాగ్ క‌నిపించ‌క‌పోగా ఆ త‌రువాత రిలీజ్ చేసిన రెండు ప్రోమోల్లో నాగ్ క‌నిపించి అద‌ర‌గొట్టేశాడు. గ‌త సీజ‌న్‌ల‌కు పూర్తి భిన్నంగా సీజ‌న్ 4 వుండ‌బోతోంద‌ని ప్రోమోల‌తో చిన్న హింట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All