Homeటాప్ స్టోరీస్మరో బోల్డ్ సినిమా ఈ భైరవగీత

మరో బోల్డ్ సినిమా ఈ భైరవగీత

Bhairava geetha trailer talk ఇప్పటికే బోల్డ్ సినిమాలు టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేస్తుండగా తాజాగా ఆ కోవలో మరో సినిమా వచ్చి చేరుతోంది భైరవ గీత పేరుతో . వివాదాస్పద దర్శకులు రాంగోపాల్ వర్మ శిష్యుడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భైరవ గీత ఇప్పటికే బోల్డ్ కంటెంట్ తో యువతని ఆకర్షించింది . తాజాగా విడుదలైన ట్రైలర్ తో మరోసారి యూత్ ని టార్గెట్ చేసింది భైరవ గీత . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్నప్పటికీ అండర్ కరెంట్ గా బోల్డ్ కంటెంట్ తోనే రూపొందింది ఈ చిత్రం . బోల్డ్ కంటెంట్ కు ,లవ్ ని లేదా యాక్షన్ ని , ఫ్యాక్షన్ ని జతచేసి యువత బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు .

అందాల భామ ఇర్రా మోర్ శృంగార సన్నివేశాల్లో ఏమాత్రం జంకు బొంకు లేకుండా నటించి కుర్రకారుని ఫిదా చేస్తోంది . ధనుంజయ్ మాస్ రోల్ లో మెప్పించేలా ఉన్నాడు . నవంబర్ 22 న భైరవ గీత చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . అసలు గతనెలలోనే విడుదల అనుకున్నారు కానీ కుదరలేదు దాంతో ఈనెల 22 న విడుదల చేస్తున్నారు . సినిమాలో కంటెంట్ పక్కన పెడితే క్యాష్ చేసుకోవడానికి తెగ ఉత్సాహం అయితే చూపిస్తున్నారు అందుకే హీరో హీరోయిన్ ల మధ్య ఉన్న శృంగార సన్నివేశాల తాలూకు స్టిల్స్ ని బాగా వదులుతున్నారు .

- Advertisement -

English Title: Bhairava geetha trailer talk

YouTube video
- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All