
యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన `జయ జానకీ నాయక` సరికొత్త రికార్డుని సాధించింది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యూట్యూబ్‌లో రికార్డు బ్రేక్ చేసింది. `బాహుబలి` తరువాత మన తెలుగు చిత్రాలకు హిందీ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో మన తెలుగు చిత్రాల హిందీ అనువాదాలకు భారీ డిమాండ్ ఏర్పడింది.
ముఖ్యంగా యాక్షన్ ఎంటర్‌టైనర్ లని హిందీ ప్రేక్షకులు అమితంగా ఇష్టపడుతున్నారు. దీంతో యాక్షన్ చిత్రాలకు భారీ డిమాండ్ ఏర్పడింది. అల్లు అర్జున్ నటించిన డిజే, సరైనోడు చిత్రాలు హిందీ వెర్షన్‌లో యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌ని సాధించాయి. ఈ జాబితాలో బెల్లంకొండ శ్రీనివాస్ చిత్రం `జయ జానకి నాయక` చేరింది. బోయపాటి – అల్లు అర్జునల కాంబినేషన్‌లో వచ్చిన `సరైనోడు` హిందీ వెర్షన్ యూట్యూబ్‌లో 300 మిలియన్ పై చిలుకు వ్యూస్ ని దక్కించుకుని సరికొత్త రికార్డుని నెలకొల్పిన తొలి సౌత్ ఇండియా సినిమాగా నిలిచింది. .
ఆ రికార్డుకు చేరువలో వుంది బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన `జయ జానకి నాయక` చిత్రం. ఈ మూవీ హిందీ వెర్షన్ 300 మిలియన్ వ్యూస్‌ని దక్కించుకుని బన్నీ సినిమా తరువాతి స్థానంలో నిలిచింది. బన్నీ తరువాత యూట్యూబ్‌లో ఆ ఘనతను సాధించిన హీరోగా బెల్లంకొండ శ్రీనివాస్ రికార్డుని సాధించడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు.