Homeగాసిప్స్ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్దమైందా?

ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్దమైందా?

ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్దమైందా?
ఛత్రపతి రీమేక్ కు సర్వం సిద్దమైందా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సంక్రాంతికి అల్లుడు అదుర్స్ గా వచ్చాడు. అయితే ఈ చిత్రం దారుణమైన ప్లాప్ గా నిలిచింది. క్రిటిక్స్ ఈ చిత్రాన్ని ఏకిపడేసారు. ఆడియెన్స్ కూడా అల్లుడు అదుర్స్ ను రిజెక్ట్ చేసారు. ఈ నేపథ్యంలో బెల్లంకొండ బాలీవుడ్ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ ప్లాప్ తర్వాత బాలీవుడ్ నిర్మాతలు బెల్లకొండతో సినిమా చేయడానికి వెనుకాడుతున్నారని వార్తలు బలంగా వినిపించాయి.

అయితే ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలుస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ తో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ పనులు సజావుగా సాగుతున్నాయని, వచ్చే నెల నుండి ఈ ప్రాజెక్ట్ రెగ్యులర్ షూటింగ్ కు వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఈ సినిమా ద్వారానే వివి వినాయక్ కూడా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ రీమేక్ లో నటించడానికి టాప్ బాలీవుడ్ కథానాయికను ఎంపిక చేసే పనిలో ఉన్నారు నిర్మాతలు. మరి చూడాలి ఎవరు సెట్ అవుతాడో.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All