Homeటాప్ స్టోరీస్`అల్లుడు అదుర్స్‌` మూవీ రివ్యూ

`అల్లుడు అదుర్స్‌` మూవీ రివ్యూ

`అల్లుడు అదుర్స్‌` మూవీ రివ్యూ
`అల్లుడు అదుర్స్‌` మూవీ రివ్యూ

న‌టీన‌టులు:  బెల్లంకొండ శ్రీనివాస్‌, న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్‌, సోనుసూద్‌, ప్ర‌కాష్‌రాజ్‌, వెన్నెల కిషోర్‌, స‌ప్త‌గిరి, బ్ర‌హ్మాజీ త‌దిత‌రులు న‌టించారు.
క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌‌ర్శ‌క‌త్వం: స‌ంతోష్ శ్రీ‌నివాస్‌
నిర్మాత‌: ‌గొర్రెల సుబ్ర‌హ్మ‌ణ్యం
సంగీతం: దేవిశ్రీ‌ప్రసాద్‌
సిన‌రిమాటోగ్ర‌ఫీ : చోటా కె. నాయుడు
ఎడిటింగ్ : త‌మ్మిరాజు
రిలీజ్ డేట్ : 14 – 01- 2021
రేటింగ్ : 2.5/5

`రాక్ష‌సుడు` వంటి హిట్ సినిమా త‌రువాత బెల్లంకొండ శ్రీ‌నివాస్ న‌టించిన `సీత‌` ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. తేజ ద‌ర్శ‌క‌త్వంలో కాజ‌ల్ అగ‌ర్వాల్‌తో క‌లిసి చేసిన ఈ మూవీ హిట్ అవుతుంద‌ని భారీ అంచ‌నాలు పెట్టుకున్నా ఎలాంటి లాభం లేకుండా పోయింది. దీంతో హిట్ కోసం బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఈ సారి త‌న తొలి చిత్రం `అల్లుడు శీను` ఫార్ములాని న‌మ్ముకుని చేసిన సినిమా `అల్లుడు అదుర్స్‌`. త‌న‌కెంతో క‌లిసొచ్చిన అల్లుడు సెంటిమెంట్ ఈసారి బెల్లంకొండ శ్రీ‌నివాస్‌కు హిట్‌ని అందించిందా?.. మ‌రోసారి ఆ మ్యాజిక్‌ని రిపీట్ చేసిందా?..  సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం అనుకున్న స్థాయిలోనే ఆక‌ట్టుకుందా అన్న‌ది తెలియాలంటే క‌థ‌లోకి వెళ్లాల్సిందే.

- Advertisement -

క‌థ‌:
సాయి శ్రీ‌నివాస్  అలియాస్ శ్రీ‌ను (బెల్లంకొండ శ్రీ‌నివాస్‌) చ‌లాకీ కుర్రాడు. తొమ్మిద‌వ త‌ర‌గ‌తిలోనే వ‌సుంధ‌ర (అను ఇమ్మాన్యుయేల్‌)ను ప్రేమిస్తాడు. అయితే అనుకోని ప‌రీస్థితుల కార‌ణంగా శ్రీ‌నుని వ‌దిలి వ‌సుంధ‌ర వెళ్లిపోతుంది. ఈ అనూహ్య ప‌రిణామానికి శ్రీ‌నుకి ప్రేమ అంటే అస‌హ్యం ఏర్ప‌డుతుంది. ఈ సంఘ‌ట‌న కార‌ణంగా జీవితంలో ఎవ‌రినీ ప్రేమించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించుకుంటాడు. కానీ కౌముది (న‌భా న‌టేష్‌)ని చూసి తొలి చూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. కానీ అది కౌముది తండ్రి జైపాల్‌రెడ్డి(ప్ర‌కాష్‌రాజ్‌)కి ఇష్టం వుండ‌దు. ఈ నేప‌థ్యంలో కౌముదిని ప‌దిరోజుల్లో ప్రేమ‌లో ప‌డేస్తాన‌ని కౌముది తండ్రి జైపాల్‌రెడ్డితో ఛాలెంజ్ చేస్తాడు. ఈ ఛాలెంజ్‌లో శ్రీ‌ను విజ‌యం సాధించాడా?.. ఇంత‌కీ గ‌జ (సోనుసూద్‌) ఎవ‌రు? అత‌నితో శ్రీ‌నుకు వున్న వైరం ఏంటీ? .. వ‌సుంధ‌ర మ‌ళ్లీ శ్రీ‌ను జీవితంలోకి ఎలా వ‌చ్చింది? వ‌ంటి విష‌యాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

న‌టీన‌టుల న‌ట‌న‌:
హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్ వ‌న్ మ్యాన్ షో. క‌థ మొత్తం అత‌ని చుట్టే తిరుగుతుంది. యాక్ష‌న్ స‌న్నివేశాల విష‌యంలో యాజిటీజ్‌గా బెల్లంకొండ అద‌ర‌గొట్టేశాడు. డైలాగ్ డిక్ష‌న్‌, న‌ట‌న విష‌యంలో కొంచెం ఇబ్బంది ప‌డిన‌ట్టు క‌నిపించింది. కామెడీ టైమింగ్ కూడా మ‌రింత మెరుగుప‌డాల్సిన అవ‌సరం వుంది. ఇక కీల‌క పాత్ర‌లో న‌టించిన  ప్ర‌కాష్‌రాజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇలాంటి పాత్ర‌లు ఆయ‌నకు కొత్తకాదు. ముద్దు గుమ్మ‌లు అను ఇమ్మాన్యుయేల్‌, న‌భా న‌టేష్ త‌మ‌ గ్లామ‌ర్ తో ఆక‌ట్టుకున్నారు. వీరి త‌రువాత ప్రాధాన్య‌త వున్నది సోనుసూద్ పాత్ర‌కే. లాక్‌డౌన్ త‌రువాత హీరో కావ‌డంతో అందుకు అనుగునంగా ఆయ‌న పాత్ర‌ని మార్చామ‌ని ద‌ర్శ‌కుడు చెప్పుకొచ్చారు కానీ అందులో ఎలాంటి నిజం లేదు. ఎప్ప‌టి లాగే సోనుని విల‌న్‌గా చూపించారు. మిగ‌తా పాత్రల్లో కొంత మంది న‌టించినా పెద్దగా ప్ర‌యోజ‌నం లేదు. ఇక శ్రీ‌నివాస‌రెడ్డి, వెన్నెల‌కిషోర్ లాంటి వాళ్లు వున్నా వారితో కామెడీని పండించ‌లేక‌పోయారు.

సాంకేతిక వర్గం:
ఈ చిత్రానికి సంబంధించిన టెక్నీషియ‌న్స్‌లో ప్ర‌ముఖంగా చెప్పుకోవాల్సింది కెమెరామెన్ చోటా కె. నాయుడు గురించే. సినిమాని రిచ్‌గా చూపించాల‌ని నిర్మాత భావిస్తే దానికి అనుగునంగా విజువ‌ల్స్‌ని అందించ‌డంలో చోట కె. నాయుడు నూటికి నూరుశాతం స‌క్సెస్ అయ్యారు. దేవిశ్రీ‌ప్ర‌సాద్ సంగీతం ఫ‌ర‌వాలేదు. మాస్ సాంగ్స్ ఆక‌ట్టుకునేలా వున్నాయి. సినిమాలోని ప్ర‌తీ స‌న్నివేశం రిచ్‌గా క‌నిపించ‌డం ఆర్ట్ డైరెక్ట‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషించారు. ఆయ‌న‌వ‌ల్లే విజువ‌ల్స్ అందింగా మారాయి. తొలి భాగంలో ద‌ర్శ‌కుడు రాసిన పంచ్ డైలాగ్‌లు బాగానే పేలాయి. రామ్ ల‌క్ష్మ‌ణ్ , స్ట‌న్ శివ తెర‌కెక్కించిన యాక్ష‌న్ ఘ‌ట్టాలు బాగున్నాయి. కానీ మ‌రీ ఎక్కువైన ఫీలింగ్ కూడా క‌లుగుతుంది.

తీర్పు:  
సంతోష్ శ్రీనివాస్ చేసిన `కందిరీగ‌` సూప‌ర్ హిట్‌గా నిలిచింది. అదే క‌థ‌ని అటు తిప్పి ఇటు తిప్పి `అల్లుడు అదుర్స్‌`గా మార్చిన‌ట్టుగా వుందీ సినిమా. పాత‌క‌థ‌ల్ని దులిపి దానికి క‌మ‌ర్ష‌య‌ల్ ఫార్ములాని జోడించి మూస చిత్రాల్ని చేస్తుంటార‌నే అప‌వాదు మ‌న‌వాళ్ల‌పై వుంది. దాన్ని `బాహుబ‌లి` మార్చేసి యావ‌త్ ప్ర‌పంచానికి తెలుగు సినిమా అంటే ఇద‌ని నిరూపిస్తే `అల్లుడు అదుర్స్` మాత్రం పాత క‌థ‌ల్ని రిపీట్ చేస్తామ‌ని మ‌రోసారి నిరూపించింది. తెలిసిన క‌థ‌, క‌థ‌నాలు, రొటీన్ ఫార్ములాతో సంక్రాంతి బ‌రిలో నిలిచిన ఈ చిత్రం `అల్లుడు శీను` ఫార్ములాని రిపీట్ చేయ‌లేక‌పోయింది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All