Homeటాప్ స్టోరీస్`క‌ర్ణ‌న్` రీమేక్‌లో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

`క‌ర్ణ‌న్` రీమేక్‌లో బెల్లంకొండ శ్రీ‌నివాస్‌!

Bellamkonda Sai Sreenivas in Karnan Telugu remake
Bellamkonda Sai Sreenivas in Karnan Telugu remake

స్ట్రెయిట్ సినిమాలు యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు క‌లిసి రావ‌డం లేదు. ఇటీవ‌ల చేసిన సినిమాలు ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌క‌పోవ‌డంతో బెల్లంకొండ శ్రీ‌నివాస్ రీమేక్ చిత్రాల‌పై క‌న్నేస్తున్నారు. ఇటీవ‌ల త‌మిళ హిట్ చిత్రం `రాక్ష‌స‌న్‌` తెలుగు రీమేక్‌లో న‌టించి హిట్‌ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. ఇదే ఊపులో ప్రభాస్ ‘చత్రపతి’ రీమేక్‌తో బాలీవుడ్‌లో అడుగుపెడుతున్నాడు.

దీనికి సంబంధించిన ఏర్పాట్ల‌న్నీ చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌ని ప్రారంభించాల‌ని ప్ర‌యత్నాలు కూడా జ‌రుగుతున్నాయి. ఇదిలా వుంటే బెల్లాంకొండ శ్రీ‌నావాస్ మరో రీమేక్ చిత్రానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు చెబుతున్నారు.  ధనుష్ హీరోగా న‌టించిన త‌మిళ చిత్రం ‘కర్ణన్’.  ఇటీవల విడుదలై అద్భుత విజ‌యాన్ని సాధించడ‌మే కాకుండా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ కలెక్షన్లని సాధించింది.

- Advertisement -

హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తండ్రి, నిర్మాత బెల్లంకొండ సురేష్ ‘కర్ణన్’ తెలుగు రీమేక్ హక్కులను భారీ మొత్తానికి కొనుగోలు చేసినట్లు తెలిసింది. బెల్లంకొండ సురేష్ ఈ మూవీని తన కొడుకుతో రీమేక్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ డ్రామా 90 ల మధ్య కాలంలో తమిళనాడులో జరిగిన య‌దార్ధ‌ సంఘటనల ఆధారంగా తెర‌కెక్కింది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All