
విజయ్ హీరోగా తెరకెక్కిన బీస్ట్ మూవీ తెలుగు ట్రైలర్ కొద్దిసేపటికి క్రితం రిలీజ్ అయ్యింది. ఉగాది సందర్భాంగా తమిళ్ వెర్షన్ ట్రైలర్ విడుదలై యూట్యూబ్ లో దుమ్ములేపగా.. ఈరోజు తెలుగు ట్రైలర్ విడుదల అయ్యింది. తమిళ స్టార్ హీరో విజయ్, పూజా హెగ్డే జంటగా నెల్సన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మూవీ ‘బీస్ట్’. ఈ సినిమా కోసం విజయ్ ఫ్యాన్స్ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. కేవలం తమిళంలోనే కాకుండా తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.
రాజకీయ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా ఏప్రిల్ 13 న వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్ లలో భాగంగా తెలుగు ట్రైలర్ విడుదల చేసి ఆసక్తి నింపారు. ట్రైలర్ చూస్తుంటే..సినిమాలో సోల్జర్ గా విజయ్ కనిపించబోతున్నట్లు అర్ధమవుతుంది. తన ఫైట్స్, యాక్షన్ తో.. కుమ్మేసాడు. అలాగే అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అందరినీ అలరిస్తోంది. మొత్తానికి ఈ ట్రైలర్ చూస్తుంటే విజయ్ ఖాతాలో మరో బిగ్గెస్ట్ హిట్ పడినట్లేనని అనిపిస్తుంది.