HomePolitical Newsతెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలైంది

తెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలైంది

తెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలైంది
తెలంగాణలో బతుకమ్మ సంబురం మొదలైంది

ఊరూరా.. వాడవాడలా తొలిరోజు ఎంగిలిపువ్వు బతుకమ్మను గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకున్నారు. సంప్రదాయ వస్త్రాలంకరణలో యువతుల ఆటపాటలతో రాష్ట్రంలో సందడి వాతావరణం నెలకొంది. తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ సంబురాలు.. రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పూలపండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు ఆడపడుచులు. ఎంగిలిపూలతో మొదలైన బతుకమ్మ వేడుకలు ఏడురోజులపాటు కొనసాగనున్నాయి.

చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగియనున్నాయి. ఎంగిలిపూవుతో మొదలైన సంబురాల్లో చిన్నారులు, యువతులు, మహిళలు సంప్రదాయ వస్త్రాలంకరణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బతుకమ్మ సంబరాలు మిన్నంటాయి. వేయిస్తంభాల గుడి పూలవనంగా మారింది. సంప్రదాయ వస్త్రాలంకరణలో ఆడపడుచులు ఆడిపాడుతూ సందడి చేశారు. వేలాది మందిగా వచ్చిన మహిళలతో వేయి స్తంభాలగుడి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.

- Advertisement -

ఆదిలాబాద్‌ జిల్లాలోనూ ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. శారదా మహిళామండలి ఆధ్వర్యంలో మహిళలు బతుకమ్మ చుట్టూ చేరి ఆటపాటలతో అలరించారు. అందంగా అలంకరించిన బతుకమ్మను మధ్యలో ఉంచి.. పాటలు, నృత్యంతో హోరెత్తించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా పూలపండుగను వైభవంగా జరుపుకుంటున్నారు. మహిళలంతా ఒక్కచోట చేరి.. బతుకమ్మకు ఘన స్వాగతం పలికారు. తీరొక్క పూలతో పేర్చిన బతుకమ్మలను ఒక్కచోట ఉంచిన యువతులు, మహిళలు ఆటపాటలతో అలరించారు. ఖమ్మం కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో జరిగిన ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేశారు.

జిల్లాలతో పాటు హైదరాబాద్‌ నగరంలోనూ ఎంగిలిపువ్వు బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి. రాజ్‌భవన్‌లో ఆడంబరంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో గవర్నర్‌ తమిళిసై ఆడిపాడారు. మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా నృత్యం చేశారు. గవర్నర్‌ ఉత్సాహంతో మహిళలు మరింత ఉల్లాసంగా ఆడిపాడారు మహిళలు. మహిళల పాటలు, నృత్యాలతో రాజ్‌భవన్‌ పరిసరాల్లో ఆధ్మాత్మిక శోభ వెల్లివిరిసింది. రాజ్‌భవన్‌లో బతుకమ్మ వేడుకల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. డప్పుదరువులు, సంప్రదాయ వస్త్రధారణలో విద్యార్థులు నృత్యంతో ఆకట్టుకున్నారు. సంబురాల్లో పాల్గొన్న విద్యార్థులు, మహిళలను గవర్నర్‌ శాలువాతో సన్మానించారు. జ్ఞాపికను అందజేసి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All