Homeగాసిప్స్ఆ దర్శకుడికి నిద్ర లేని రాత్రులు మిగులుస్తున్న నాగార్జున

ఆ దర్శకుడికి నిద్ర లేని రాత్రులు మిగులుస్తున్న నాగార్జున

ఆ దర్శకుడికి నిద్ర లేని రాత్రులు మిగులుస్తున్న నాగార్జున
ఆ దర్శకుడికి నిద్ర లేని రాత్రులు మిగులుస్తున్న నాగార్జున

కింగ్ నాగార్జున కథల విషయంలో అంత పట్టుబట్టి ఏం ఉండడు. దర్శకుడిపై నమ్మకం కుదిరితే కథ ఏంటనేది కూడా చూడకుండా సినిమాను ఓకే చేసిన సందర్భాలు ఉన్నాయి. పూరి జగన్నాథ్ తో చేసిన సూపర్ కు అలానే జరిగింది. కేవలం ఒక లైన్ అనుకుని దానికి తగ్గట్లుగా కొన్ని సన్నివేశాలను చెప్పి ఓకే చేయించుకున్నాడు పూరి జగన్నాథ్. అలాంటి నాగార్జున ఇప్పుడు కథల విషయంలో బాగా స్ట్రిక్ట్ అయిపోయాడు. ముఖ్యంగా మన్మథుడు 2 ఇచ్చిన చేదు ఫలితంతో ఏ సినిమా ఓకే చేయాలన్నా కూడా ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. మన్మథుడు 2 విషయంలో కూడా నాగ్ ఉదాసీనంగానే ఉన్నాడు. కొన్ని సందేహాలున్నా దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ను ఇబ్బంది పెట్టకుండా సినిమా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఆ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుందో అందరం చూసాం. అందుకే ఈసారి నాగ్ అసలు మొహమాట పడదల్చుకోలేదు.

హీరోగా ఇప్పటికే చాలా సీనియర్ అయిపోయిన నాగ్ కథ నచ్చితేనే చేస్తా అంటున్నాడు. ఇది దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు శాపంగా మారింది. అసలు అందరికంటే ఈరోజుల్లో కళ్యాణ్ కృష్ణనే ఎక్కువ నమ్మాలి నాగార్జున. ఎందుకంటే తనకు సోగ్గాడి చిన్ని నాయన వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వడమే కాకుండా, తన కొడుకు నాగ చైతన్యకు రారండోయ్ వేడుక చూద్దాం అంటూ సూపర్ హిట్ ను అందించాడు. ఇలా చేసిన ఏ దర్శకుడినైనా నెత్తిన పెట్టుకుని చూసుకుంటారు. పెద్దగా కథ కూడా వినకుండా చేసేద్దాం అని మాట ఇచ్చేస్తారు. కానీ కళ్యాణ్ కృష్ణ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. గత మూడేళ్ళుగా ఆయన సోగ్గాడే చిన్ని నాయన చిత్రానికి ప్రీక్వెల్ గా బంగార్రాజును చేద్దామని ప్రయత్నిస్తున్నాడు. నాగ్ కు లైన్ కూడా చెప్పాడు నచ్చింది. ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమన్నాడు. సరిగ్గా అక్కడ వచ్చింది ఇబ్బందంతా. ఇప్పటికే మూడు వెర్షన్లు రాసినా నాగ్ ఎందుకో సంతృప్తి చెందలేదు. మధ్యలో కళ్యాణ్ కృష్ణ రవితేజతో నేల టికెట్ చేసాడు కానీ అది సరైన ఫలితాన్నివ్వలేదు. దీంతో అతని పరిస్థితి మరింత అగమ్యగోచరంగా ఉంది.

- Advertisement -

రీసెంట్ గా నాగ చైతన్య ఈ సినిమా పరిస్థితి గురించి వివరించాడు. స్క్రిప్ట్ నాగార్జునకు నచ్చలేదని, దర్శకుడు మరో వెర్షన్ రాసే పనిలో పడ్డాడని తెలియజేసాడు నాగ చైతన్య. ఈ దర్శకుడి పరిస్థితి చూసి ఇండస్ట్రీలో జాలి పడే వాళ్ళు ఎక్కువైపోయారు. స్క్రిప్ట్ మాత్రం వర్కౌట్ అయ్యేలా కనిపించట్లేదు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All