Homeగాసిప్స్మళ్ళీ వార్తల్లోకి వచ్చిన నాగార్జున బంగార్రాజు

మళ్ళీ వార్తల్లోకి వచ్చిన నాగార్జున బంగార్రాజు

మళ్ళీ వార్తల్లోకి వచ్చిన నాగార్జున బంగార్రాజు
మళ్ళీ వార్తల్లోకి వచ్చిన నాగార్జున బంగార్రాజు

బంగార్రాజు ప్రాజెక్ట్ ను నాగార్జున అనౌన్స్ చేసి మూడేళ్లు పూర్తయింది. సోగ్గాడే చిన్ని నాయన రిలీజ్ సమయంలోనే ఈ చిత్రానికి ప్రీక్వెల్ లేదా సీక్వెల్ ఉంటుందని ప్రకటించాడు నాగార్జున. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో బంగార్రాజు ప్రాజెక్ట్ పై అందరికీ ఆసక్తి పెరిగింది. అయితే ఎందుకనో ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలెక్కలేదు. బంగార్రాజు సినిమాను అనౌన్స్ చేసిన తర్వాత నాగార్జున మూడు ప్రాజెక్టులు పూర్తి చేసాడు కానీ బంగార్రాజు మాత్రం ఓ కొలిక్కి రాలేదు. క్రితం సంవత్సరం బిగ్ బాస్ ను హోస్ట్ చేసిన నాగార్జున అది పూర్తైన వెంటనే ఈ సినిమానే చేస్తాడని అన్నారు కానీ నాగ్ ఇంకా ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో పూర్తి సంతృప్తిగా లేని కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

ప్రస్తుతం నాగార్జున వైల్డ్ డాగ్ అనే విభిన్న చిత్రాన్ని చేస్తున్నాడు. ఊపిరి సినిమాకు రచయితగా పనిచేసిన సోలమన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం తర్వాత నాగార్జున బంగార్రాజుని పట్టాలెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. వైల్డ్ డాగ్ ను మే లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. షూటింగ్ మాత్రం మార్చ్ కే పూర్తైపోతుంది. ఇటీవలే బంగార్రాజు లేటెస్ట్ వెర్షన్ విన్న నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఈ స్క్రిప్ట్ కు రిపేర్ల మీద రిపేర్లు చేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇప్పుడు ప్రీ ప్రొడక్షన్ పనులను మొదలుపెట్టేశాడు. అనూప్ రూబెన్స్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగ్స్ లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఏదైతేనేం మొత్తానికి బంగార్రాజులో కదలిక రావడం పట్ల నాగ్ అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All