Homeటాప్ స్టోరీస్బందోబస్త్ రివ్యూ

బందోబస్త్ రివ్యూ

బందోబస్త్ రివ్యూ:
బందోబస్త్ రివ్యూ:

బందోబస్త్ రివ్యూ:
నటీనటులు: సూర్య, మోహన్ లాల్, ఆర్య, సయేశా, బోమన్ ఇరానీ తదితరులు.
దర్శకత్వం: కె వి ఆనంద్
నిర్మాత‌లు: సుభాస్కరన్‌ అల్లిరాజా
సంగీతం: హరీష్ జయరాజ్
సినిమాటోగ్రఫర్: ఎం ఎస్ ప్రభు
విడుదల తేదీ: 20 సెప్టెంబర్ 2019
రేటింగ్ : 2.5/5

విలక్షణ పాత్రలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న హీరో సూర్య, కథల ఎంపికలో పొరబాట్లు చేసి తెలుగులో మార్కెట్ ను పోగొట్టుకున్నాడు. తమిళంలో కూడా హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కె వి ఆనంద్ తో కలిసి బందోబస్త్ సినిమా చేసాడు. ఈరోజే విడుదలైన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

కథ :

ప్రధాని చంద్రకాంత్ వర్మ (మోహన్ లాల్) ప్రజలకు మంచి చేయాలని తపించే నాయకుడు. ఆయనకు స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా నియమించబడతాడు రవి కిషోర్ (సూర్య). కిషోర్ ఛార్జ్ తీసుకున్న తర్వాత కొన్ని నాటకీయ పరిణామాల అనంతరం ప్రధాని హత్య చేయబడతాడు. ప్రధానిని చంపింది ఎవరు? కిషోర్ కు దీనికి ఏమైనా సంబంధం ఉందా? చంద్రకాంత్ వర్మ తర్వాత ప్రధాని ఎవరు? అసలు హంతకులు ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు :

పోలీస్ పాత్రలంటే రెచ్చిపోయి నటించే సూర్య, ఈ సినిమాలో స్పెషల్ ఆఫీసర్ గా ది బెస్ట్ ఇచ్చాడు. పాత్రకు తగినట్లుగా వివిధ వేరియేషన్స్ ను పెర్ఫెక్ట్ గా ప్రోజెక్ట్ చేయగలిగాడు. ప్రధానమంత్రి పాత్రలో మోహన్ లాల్ ఆకట్టుకున్నాడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోగలనని మరోమారు నిరూపించాడు. సయేశా కూడా బానే చేసింది. తన పాత్ర పరిధి మేర నటించింది. ఆర్య పర్వాలేదు. సముధ్రఖని, పూర్ణ తదితరులు తమ పాత్రలకు న్యాయం చేసారు. బోమన్ ఇరానీ మల్టీ మిలియనీర్ గా కనిపించాడు.

సాంకేతిక విభాగం :

బందోబస్త్ లో సినిమాటోగ్రఫీ కట్టిపడేస్తుంది. యాక్షన్ సీక్వెన్స్ లో కెమెరా పనితనం అద్భుతం అని చెప్పవచ్చు. హారిస్ జయరాజ్ అందించిన నేపధ్య సంగీతం ఆకట్టుకుంటుంది. అయితే పాటలు మాత్రం చాలా నార్మల్ గా అనిపిస్తాయి. గుర్తించుకునే పాట ఒక్కటి కూడా లేదు. ఎడిటింగ్ ఓకే. నిర్మాణ విలువలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయి. దర్శకుడిగా కెవి ఆనంద్ విఫలమయ్యాడు. కథ బాగున్నా దానికి తగ్గ బిగువైన కథనాన్ని రాసుకోవడంలో అతను ఫెయిల్ అయ్యాడని చెప్పవచ్చు. స్క్రిప్ట్ కి ఇంకా మెరుగులు దిద్ది ఉంటే ఇంకా బెటర్ ఔట్పుట్ వచ్చేది.

చివరిగా :

ఓపెనింగ్ సీక్వెన్స్ తో ఆసక్తి కలిగించిన దర్శకుడు తర్వాత వ్యవహారాన్ని రొటీన్ గా మారుస్తాడు. ఇంటర్వెల్ బ్లాక్ లో మళ్ళీ ఉత్తేజం వస్తుంది. మొత్తం మోహన్ లాల్ ట్రాక్ ను బాగా తీర్చిదిద్దాడు. అయితే సినిమా పడుతూ లేస్తూ ముందుకు సాగడం వల్ల ప్రేక్షకులకు ఆసక్తి సన్నగిల్లుతుంది. మంచి సెటప్ ను పెట్టుకుని కెవి ఆనంద్ మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాడు. మొత్తంగా బందోబస్త్ చాలా సాదాసీదాగా అనిపించే ఒక పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్.

బందోబస్త్ : జస్ట్ ఓకే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All