Sunday, September 25, 2022
Homeటాప్ స్టోరీస్సూర్య వైభవం మొత్తం పోయినట్లేనా?

సూర్య వైభవం మొత్తం పోయినట్లేనా?

సూర్య వైభవం మొత్తం పోయినట్లేనా?
సూర్య వైభవం మొత్తం పోయినట్లేనా?

తమిళ స్టార్ హీరో సూర్యకు ఒకప్పుడు తెలుగులో విపరీతమైన క్రేజ్ ఉండేది. ఇక్కడ అతని సినిమాలు 20 కోట్ల దాకా బిజినెస్ చేసిన రోజులున్నాయి. సూర్య సినిమా వస్తోందంటే తమ సినిమాలు వాయిదా వేసుకునేవారు తెలుగు నిర్మాతలు. ఆ స్థాయి నుండి సూర్య కథల ఎంపికలో చేసిన పొరబాట్ల వల్ల ఇప్పుడు అతని సినిమా వస్తోందంటే లెక్క కూడా చేయని పరిస్థితి నెలకొంది. నిన్న సూర్య నటించిన బందోబస్త్ సినిమాకు ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

- Advertisement -

ఇది జరిగిందని చాలా మంది తెలుగు ప్రేక్షకులకు తెలీదు. అంతలా ఆ సినిమాపై బజ్ ఉంది. ఈవెంట్ ను కూడా చాలా లో ప్రొఫైల్ లో కానిచ్చేశారు. బందోబస్త్ వాల్మీకికి పోటీగా ఈ నెల 20న విడుదల కానుంది. సయేశా సైగల్ ఇందులో హీరోయిన్ గా నటించింది. నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సూర్య తనను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఒకప్పుడు ఇక్కడ అత్యంత ఆదరణ కలిగిన నటుడు ఇప్పుడిలా లో ప్రొఫైల్ ఈవెంట్ లో పాల్గొనడం విడ్డూరమే. బందోబస్త్ కూడా తెలుగులో హిట్ అవుతుందన్న ఆశలు పెద్దగా లేవు. ఈ నేపథ్యంలో సూర్య మళ్ళీ ఇక్కడ గత వైభవాన్ని అందుకోగలడా?

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts