Homeటాప్ స్టోరీస్బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్ : కాన్ఫిడెంట్ గా ఉన్నారే!

బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్ : కాన్ఫిడెంట్ గా ఉన్నారే!

Bandobast censor Report
బందోబస్త్ సెన్సార్ రిపోర్ట్ : కాన్ఫిడెంట్ గా ఉన్నారే!

సూర్య నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ బందోబస్త్ కు సెన్సార్ పూర్తయింది. చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేసారు. యూ/ఏ తో సెన్సార్ పూర్తవ్వగా చిత్ర రన్ టైం 165 నిమిషాల 53 సెకెన్లని తెలుస్తోంది. చిత్ర రన్ టైం ఎక్కువగా అనిపిస్తున్నా రేసీ స్క్రీన్ ప్లేతో థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుందని నమ్మకంగా చెప్తున్నారు చిత్ర యూనిట్. ఈ చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్ర పోషించిన విషయం తెల్సిందే.

సూర్య స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సభ్యునిగా కనిపించనుండగా, మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రను పోషించారు. లైకా సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో ఆర్య, సయేశా సైగల్, బోమన్ ఇరానీ, సముద్రఖని కీలక పాత్రలు పోషించారు. మోహన్ లాల్, సూర్య మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. కెవి ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తెలుగులో తన పట్టును కోల్పోయిన సూర్య బందోబస్త్ తో వచ్చి తిరిగి సాధించాలని చూస్తున్నాడు. రేపు వాల్మీకి చిత్రంతో బందోబస్త్ తలపడనుంది.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All