
బాలీవుడ్‌లో డ్రగ్స్ వివాదం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. సుశాంత్ అనుమానాస్పద మృతి తరువాత వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. రియా అరెస్ట్ తరువాత ఈ కేసులో మరిన్ని బాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు బయటికి వచ్చాయి. దీపిక, రకుల్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌ల పేర్లు బయటికి వచ్చాయి.
ఈ కేసులో వీరికి ఎన్సీబీ అధికారులు ఇటీవల సమన్లు జారీ చేయడం, సమన్లు అందుకున్న వీరు ఒక్కొక్కరుగా ఎన్సీబి ముందు హజరు కావడం తెలిసిందే. అయితే దీపిక తరువాత నార్కోటిక్స్ డ్రగ్ కంట్రోల్ బ్యూరో ముందు సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్ విచారణకు హాజరయ్యారు. ఇందులో సారా అలీఖాన్ గతంలో సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌తో సన్నిహితంగా వుందని, ఇద్దరు ప్రేమించుకున్నారని కూడా వార్తలు రావడంతో సారాతో పాటు శ్రద్ధా కపూర్‌ల విచారణ ప్రధాన్యతను సంతరించుకుంది.
తాజాగా ఈ విచారణలో వీరు షాకిచ్చినట్టు తెలిసింది. సుశాంత్ మన మధ్య లేడు కాబట్టి తప్పునంతా అతనిపై రుద్దేందుకు సారా , శ్రద్ధా సిద్ధమైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజా విషయం ఏమిటంటే, సుశాంత్‌తో కలిసి పనిచేసిన శ్రద్ధా మరియు సారా ఇద్దరూ సుశాంత్ తన సినిమాల షూట్ విరామ సమయంలో చాలాసార్లు డ్రగ్స్ తీసుకోవడం చూసినట్లు వెల్లడించారట. ఇది ఈ కేసుని ప్రభావితం చేసేలా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో సారా వాంగ్మూలం సుశాంత్ అనుమానాస్పద మృతి కేసుని నీరు గార్చేలా వుందని తాజా టాక్.