
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అనుమానాస్పద మృతి విషయంలో దేశ వ్యాప్తంగా రియా చక్రవర్తిపై అనుమానాలు వ్యక్తం అయిన విషయం తెలిసిందే. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ విచారణ చేపట్టింది. విచారణలో రియాకు డ్రగ్ పెడ్లర్‌లకు సంబంధం వుందని తేలడంతో ఎన్సీబీ రంగంలోకి దిగి ఆ కోణంలో విచారణ మొదలుపెట్టింది. ఈడీ కూడా రంగంలోకి దిగడంతో రియా చుట్టు ఉచ్చు బిగుసుకోవడం మొదలైంది.
అయితే సుశాంత్ కేసులో ప్రధాన అనుమానితురాలిగా విచారణ ఎదుర్కొంటున్న రియా ముంబై హై కోర్టులో బెయిల్ కోసం పిటీషన్ వేసింది. ఈ పిటీషన్‌పై ఈ రోజే `(గురువారం) విచారణ జరగనుంది. అయితే బెయిల్‌కు రియా, ఆమె లాయర్ ఎలాంటి కారణాలని ప్రధానంగా ప్రస్థావించారన్నదానిపై జాతీయ మీడియాలో సంచలన కథనాలు ప్రసారం అయ్యాయి.
మానసిక కుంగుబాటు ఇతర విషయాలని తెలియజేయడానికి తరచూ రియా కుటుంబంతో సుశాంత్ మాట్లాడేవాడని, కానీ సుశాంత్ కుటుంబం మాత్రం ఆయన విషయంలో ఎలాంటి ఆందోళన చెందేది కాదు. గత ఏడాది నవంబర్‌లో సుశాంత్ ముగ్గురు సోదరీమణులు ముంబైకి వచ్చారు. సుశాంత్‌ని చికిత్సకోసం చంఢీగఢ్ తీసుకెళతామని చెప్పారు. అందుకు రియా అడ్డు చెప్పలేదు. అయితే సుశాంత్ మాత్రం తన వద్ద వున్న డబ్బు కోసమే వారు అలా మాట్లాడుతున్నారని వాళ్లతో చంఢీఘడ్ వెళ్లనని అన్నాడుని, అలాంటి అతన్ని ఆయన సిస్టర్స్ వదిలేసి వెళ్లారని ఆ తరువాత సుశాంత్ మానసిక కుంగుబాటుకి గురయ్యారని రియా తరుపు న్యాయవాది బెయిల్ పిటీషన్‌లో పేర్కొనడంతో బాలీవుడ్ వర్గాలు ఆవాక్కవుతున్నారట.