Homeటాప్ స్టోరీస్"మిలమిల అందం ఖిల్లా" అంటున్న బాలయ్య బాబు

“మిలమిల అందం ఖిల్లా” అంటున్న బాలయ్య బాబు

Balayya Babu in songs shoot
Balayya Babu in songs shoot

బాలకృష్ణ సినిమాలు అంటే అభిమానులకు ముఖ్యంగా కావాల్సింది ఆయన డైలాగులు మరియు సినిమా పాటలు. కథ,  సాంకేతిక నిపుణులతో పాటు చిత్రంలో నటించే నటీనటుల దగ్గరనుండి ప్రతి విషయంలో బాలకృష్ణ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు.

 తన అభిమానులను అలరించడానికి  మంచి మాస్ బీట్ ఉన్న పాటలను తన సినిమాలో  పెడతారు. దానికి మంచి కథ సన్నివేశం కథానాయిక తోడైతే ఇక ఆ పాటలు జనంలో అలా ఉండిపోతాయి.

- Advertisement -

 తాజాగా నటసింహం బాలకృష్ణ నటిస్తున్న చిత్రం రూలర్.  ఇంతకుముందు బాలకృష్ణతో జైసింహ సినిమా చేసిన తమిళ అగ్ర దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  ప్రముఖ నిర్మాత సి.కల్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన వేదిక, సోనాల్ చౌహాన్ కథానాయికలుగా నటిస్తున్నారు.  ప్రస్తుతం కేరళలో ఉన్న మున్నార్ లో గల  అందమైన లొకేషన్లలో బాలకృష్ణ వేదికల మీద ఒక పాట షూట్ చేస్తున్నారు.

 “మిల మిల అందం ఖిల్లా..”  అనే పాటను రామజోగయ్యశాస్త్రి రచించగా, ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఈ సినిమా కోసం బాలయ్య బాబు బాగా బరువు తగ్గి స్టైలిష్ గా తయారయ్యాడు.  బాలకృష్ణతో పాటు ప్రకాష్ రాజ్, భూమిక జయసుధ, ప్రధాన పాత్రలు ఈ సినిమాలో పోషిస్తున్నారు. ఈ సినిమాకి చిరంతన్ భట్ సంగీతం అందించగా C. రాం ప్రసాద్ డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా పనిచేస్తున్నారు.  క్రిస్మస్ సీజన్ కి ఈ సినిమా ప్రేక్షకులకు అందించడమే లక్ష్యంగా సినిమా యూనిట్ శరవేగంగా చిత్రీకరణ జరుగుతోంది

 ఆల్ ది బెస్ట్ బాలయ్య బాబు…

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All