Homeటాప్ స్టోరీస్అక్టోబర్ 5న నుండి బాలయ్య హైదరాబాద్ లో..

అక్టోబర్ 5న నుండి బాలయ్య హైదరాబాద్ లో..

Balakrishna
అక్టోబర్ 5న నుండి బాలయ్య హైదరాబాద్ లో…

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం తన 105వ చిత్రం షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సి కళ్యాణ్ నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెల్సిందే. ఇటీవలే విడుదల చేసిన ఫస్ట్ లుక్ కు విపరీతమైన పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఐరన్ మ్యాన్ ను పోలిన లుక్ లో బాలయ్య అదిరిపోయాడని కితాబులు వచ్చాయి.

ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని ముందు సంక్రాంతికి విడుదల చేయాలని భావించినా తర్వాత వెనక్కి తగ్గారట. అక్టోబర్ 5 నుండి హైదరాబాద్ లో ఈ చిత్ర తాజా షెడ్యూల్ మొదలుకానుంది. టైటిల్ తో పాటు ఈ చిత్ర టీజర్ ను దసరా కానుకగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు మొదలయ్యాయట.

- Advertisement -

రెండు డిఫరెంట్ లుక్స్ లో బాలయ్య కనిపించే ఈ చిత్రంలో వేదిక, సోనాల్ చౌహన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇంకా ప్రకాశ్‌ రాజ్‌, జయసుధ, భూమిక చావ్లా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. చిరంత‌న్ భ‌ట్‌ ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All