Homeగాసిప్స్సంక్రాంతి రేసును మిస్ అయిన బాలయ్య

సంక్రాంతి రేసును మిస్ అయిన బాలయ్య

Balakrishna
సంక్రాంతి రేసును మిస్ అయిన బాలయ్య

నందమూరి బాలకృష్ణకు సంక్రాంతి హీరో అని పేరుంది. పదుల సంఖ్యలో తన సినిమాలను సంక్రాంతి బరిలో నిలిపి చాలాసార్లు విజయం సాధించాడు బాలకృష్ణ. గత మూడు, నాలుగు సంక్రాంతులకు తన సినిమా కచ్చితంగా ఉండేలా చూసుకున్నాడు. ఈ ఏడాది ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైనా అది చేదు ఫలితాన్ని అందించింది.

ప్రస్తుతం బాలకృష్ణ, కేఎస్ రవికుమార్ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రాన్ని మొదట సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. చిత్ర యూనిట్ కూడా సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే పనిచేసాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలని చూస్తుంటే ఈసారి బాలయ్య సంక్రాంతి రేసును మిస్ అయ్యాడేమో అనిపిస్తోంది.

- Advertisement -

ఎందుకంటే ఇప్పటికే మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలు సంక్రాంతికి షెడ్యూల్ అయి ఉన్నాయి. వీటికి తోడు రజినీకాంత్ దర్బార్ ఉండనే ఉంది. ఇది చాలదన్నట్లు నందమూరి కళ్యాణ్ రామ్ ఎంత మంచివాడవురా కూడా సంక్రాంతికే వస్తుందని అఫీషియల్ గా చెప్పేసారు. కళ్యాణ్ రామ్ సంక్రాంతికి సినిమా షెడ్యూల్ చేసుకున్నాడంటే అది బాలయ్యతో సంప్రదించకుండానే జరుగుతుందని మనం అనుకోలేం. అందుకే వీటిని బట్టి చూస్తే బాలయ్య ఈసారి సంక్రాంతి మజాను మిస్ చేసుకున్నట్లే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All