Homeగాసిప్స్బాలయ్య మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా?

బాలయ్య మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా?

బాలయ్య మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా?
బాలయ్య మీద అంత బడ్జెట్ వర్కౌట్ అవుతుందా?

నందమూరి బాలకృష్ణ కెరీర్ విచిత్రమైనది. ముందు ఎన్ని ప్లాపులు వచ్చినా సరైన సినిమా ఒక్కటి పడిందంటే ముందు సినిమాల ఎఫెక్ట్ ఉన్నాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధిస్తుంది. సింహా, లెజండ్ వంటి సినిమాల కలెక్షన్స్ విషయంలో మనం ఇది చూసాం. ప్రస్తుతం బాలకృష్ణ కెరీర్ మరోసారి ఇలాంటి పరిస్థితిలోనే పడింది. వరసగా మూడు ప్లాపులు వచ్చిన తర్వాత ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు.

ఈ చిత్రానికి అఖండ టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన విషయం తెల్సిందే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తయింది. పూర్తి స్థాయి కమర్షియల్ అంశాలతో ఈ చిత్రాన్ని బోయపాటి రూపొందిస్తున్నాడు. ప్రగ్యా జైస్వాల్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుండగా మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు.

- Advertisement -

ఇండస్ట్రీలో వినిపిస్తోన్న సమాచారం ప్రకారం అఖండ చిత్రానికి భారీ లెవెల్లో బడ్జెట్ ను కేటాయించారట. దాదాపు 75 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు సమాచారం. ప్రస్తుతం బాలకృష్ణకు ఉన్న మార్కెట్ కు, ప్రస్తుతమున్న పరిస్థితులకు ఈ బడ్జెట్ వర్కౌట్ అవుతుందా అన్నది ప్రధాన డౌట్.

అఖండలో బాలకృష్ణ రెండు భిన్న పాత్రల్లో నటిస్తున్నాడు. అందులో ఒకటి అఘోరా పాత్ర. టీజర్ తో అంచనాలను రేకెత్తించిన అఖండ రిలీజ్ డేట్ కోసం చూస్తోంది. ఎస్ ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All