
కన్నడ హీరో యష్ హీరోగా నేషనల్ వైడ్ గుర్తింపును తెచ్చుకుంది కేజిఎఫ్ చిత్రంతో. ఈ సినిమా దేశవ్యాప్తంగా భారీ విజయాన్ని అందుకుంది. ప్రశాంత్ నీల్ దర్శకుడిగా తన స్థాయిని చాటిచెప్పాడు. ఇప్పుడు వరసగా బడా అవకాశాలను అందుకుంటున్నాడు. ఇక కేజిఎఫ్ చాప్టర్ 2 మరోవైపు విడుదలకు సిద్ధంగా ఉంది. జులైలో విడుదల అని ప్రకటించారు కానీ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు.
కేజిఎఫ్ చాప్టర్ 1 లో కొన్ని ముఖాలను కనిపించకుండా సీక్రెట్ గా ఉంచారు. అందులో దుబాయ్ డాన్ ఇనాయత్ ఖలీల్ పాత్ర ఒకటి. ఈ పాత్రను ఇప్పుడు రివీల్ చేసారు నిర్మాతలు. చాలా ముఖ్యమైన ఈ పాత్ర కోసం నటుడు బాలకృష్ణను ఎంపిక చేసుకున్నారు. తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న ఆదర్శ్ బాలకృష్ణ తండ్రే ఈ బాలకృష్ణ.
ఇండియాలో సీక్రెట్ గా పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్న ఇనాయత్ ఖలీల్ అనే పేపర్ కటింగ్ తో ఉన్న పోస్టర్ ను విడుదల చేసారు.
Wishing @BalaTheKrishna a very Happy Birthday.
Have a safe birthday chinna????
Here’s a glimpse of #InayathKhalil in #KGFChapter2
Stay home stay safe everyone???????? pic.twitter.com/SNl8RlVq0l— Prashanth Neel (@prashanth_neel) May 31, 2021