
ప్యాన్ ఇండియా చిత్రాల్లో అందరూ చాలా ఆసక్తిగా ఎదురుచూస్తోన్న చిత్రం అంటే అది కచ్చితంగా కేజిఎఫ్ చాప్టర్ 2. ఈ సినిమా కొన్ని నెలల కిందటే షూటింగ్ ను పూర్తి చేసుకుని విడుదలకు ముస్తాబవుతోంది. జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు కానీ ప్రస్తుతమున్న సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి.
చాప్టర్ 1 కు మించి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్ధమవుతోంది. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ కేజిఎఫ్ చాప్టర్ 2 విషయంలో మరింత శ్రద్ధ పెట్టినట్లు తెలుస్తోంది. మరిన్ని మాస్ మసాలా అంశాలను జొప్పించాడట. కేజిఎఫ్ చాప్టర్ 2 లో రెండు ఐటెం సాంగ్స్ ఉన్నాయిట. ఫస్ట్ హాఫ్ లో ఒకటి, సెకండ్ హాఫ్ లో ఒకటి ఉన్నట్లు తెలుస్తోంది.
ఒక ఐటెం సాంగ్ లో జాక్వెలిన్ ఫెర్నాండేజ్, మరొక దాంట్లో నోరా ఫతేహి ఉన్నారట. ఈ రెండు ఐటెం సాంగ్స్ మాస్ ప్రేక్షకులకు ఫుల్ ఫీస్ట్ అని అంటున్నారు. కేజిఎఫ్ పై వస్తోన్న వార్తలు చిత్రంపై అంచనాలను మరింత పెంచుతున్నాయి.