Homeగాసిప్స్మాసుమహారాజాతో బాలయ్య మరోసారి ఢీ కొట్టబోతున్నాడా?

మాసుమహారాజాతో బాలయ్య మరోసారి ఢీ కొట్టబోతున్నాడా?

Balakrishna next film release date announcement soon
Balakrishna next film release date announcement soon

2020లో సినిమాలు చాలా వరకూ విడుదల కాలేదు. మరిన్ని సినిమాలు షూటింగ్స్ జరగకుండా ఆగిపోయాయి. ప్రస్తుతం నార్మల్ పరిస్థితులు నెలకొంటున్న నేపథ్యంలో దాదాపు అన్ని సినిమాలు కూడా షూటింగ్స్ ను మొదలుపెట్టేశాయి. ఇక మూడు రోజుల క్రితం రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ డేట్ ను ప్రకటించిన దగ్గరనుండి మొదలైన హవా ఇంకా కొనసాగుతూనే ఉంది. దాదాపు 20 సినిమాల వరకూ తమ రిలీజ్ డేట్లను ప్రకటించేసాయి.

అందరూ రిలీజ్ డేట్లతో వచ్చేసినా కానీ సినిమాలు ఫాస్ట్ గా పూర్తి చేసే అలవాటున్న బాలయ్య మాత్రం ఇంకా రిలీజ్ డేట్ విషయంలో ఎటువంటి ప్రకటన చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా సాగుతోంది.

- Advertisement -

తాజాగా వినిపిస్తోన్న సమాచారం మేరకు ఈ చిత్రాన్ని మే 28న విడుదల చేయబోతున్నారట. ఇదే డేట్ కు రవితేజ ఖిలాడీతో వస్తోన్న విషయం తెల్సిందే. గతంలో పలుమార్లు వీరిద్దరి మధ్యా బాక్స్ ఆఫీస్ పోరు నడిచింది. ఇప్పుడు మరోసారి అదే జరుగనుందా?

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All