Thursday, October 6, 2022
Homeగాసిప్స్బాలయ్య బలరామయ్యగా బరిలో దిగుతాడా?

బాలయ్య బలరామయ్యగా బరిలో దిగుతాడా?

బాలయ్య బలరామయ్యగా బరిలో దిగుతాడా?
బాలయ్య బలరామయ్యగా బరిలో దిగుతాడా?

వరస ప్లాపులు చుట్టుముట్టినా ఇంకా ఎక్కువ ఊపుతో సినిమాలను సెట్ చేయడం బాలయ్య ప్రత్యేకత. వరసగా హ్యాట్రిక్ ప్లాపులను అందుకున్న నందమూరి బాలకృష్ణ ఇప్పుడు మూడు ప్రాజెక్టులను లైన్లో పెట్టాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ సినిమా చేస్తోన్న విషయం తెల్సిందే.

- Advertisement -

లాక్ డౌన్ కు ముందు ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం రీసెంట్ గా మరో కొత్త షెడ్యూల్ ను ప్రారంభించింది. షూటింగ్ శరవేగంగా సాగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఈ చిత్రం తర్వాత నందమూరి బాలకృష్ణ వెటరన్ దర్శకుడు బి. గోపాల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే. అంతే కాకుండా యంగ్ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చెప్పిన లైన్ కు కూడా బాలయ్య ఇంప్రెస్ అయినట్లు తెలుస్తోంది.

దీంతో ప్రాజెక్టుకు ఎస్ చెప్పినట్లు సమాచారం. అంతే కాకుండా ఈ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ అయ్యారట. బలరామయ్య బరిలో దిగితే.. అనే విభిన్నమైన టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts