
1980 నుంచి 1990 ల కాలంలో స్టార్ హీరోయిన్‌లుగా ఓ వెలుగు వెలిగిన హీరోయిన్‌లలో మీనా ఒకరు. చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్లతో కలిసి మీనా అనేక చిత్రాల్లో నటించింది. చాలా కాలం తరువాత `దృశ్యం`లో వెంకటేష్‌కు జోడీగా మీనా కనిపించిన విషయం తెలిసిందే. తాజగా ఈ చిత్రానికి సీక్వెల్ గా రూపొందుతున్న`దర్శ్యం 2` చిత్రంలోనూ వెంకటేష్ తో కలిసి మీనా నటించింది. ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయిన విషయం తెలిసిందే.
తాజా సమాచారం ప్రకారం మీనా తెలుగులో మరో పెద్ద ఆఫర్‌ను సొంతం చేసుకుందని తెలిసింది. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఓ భారీ చిత్రం చేయబోతున్న విషయం తెలిసిందే. ఇందులో బాలయ్య కోసం స్టార్ హీరోయిన్‌లతో పాటు సీనియర్ హీరోయిన్‌ల కోసం అన్వేషిస్తున్న గోపీచంద్ తాజాగా సీనియర్ హీరోయిన్ మీనాని ఫైనల్ చేసినట్టు తెలిసింది.
ఈ చిత్రంలో ఆమె కీలక పాత్ర పోషించనుంది. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లలో మీనా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ సినిమా కు ప్రధాన హైలైట్‌గా ఉంటుందని తెలుస్తోంది. బాలకృష్ణ, మీనా ఇద్దరూ ఇంతకు ముందు ముద్దుల మొగుడు, బొబ్బిలి సింహం వంటి చిత్రాల్లో కలిసి నటించారు. ఇంకా పేరు ఖరారు కాని ఈ కొత్త ప్రాజెక్ట్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. ప్రస్తుతం బాలయ్య.. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న `అఖండ` లో నటిస్తున్నారు.