Homeన్యూస్హల్ చల్ చేస్తున్న “సుమంత్ బొర్ర”, వెంకటేష్ వుప్పల...ఆల్బమ్ సాంగ్స్

హల్ చల్ చేస్తున్న “సుమంత్ బొర్ర”, వెంకటేష్ వుప్పల…ఆల్బమ్ సాంగ్స్

Audience enjoying Sumanth borra and Venkatesh Vuppala album songs
Audience enjoying Sumanth borra and Venkatesh Vuppala album songs

ప్రస్తుత యంగ్ జనరేషన్ యువకులు తమ టాలెంట్ ని ఎప్పటికప్పుడు సోషల్ నెట్ వర్క్స్ ద్వారా ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నారు. అతి చిన్న ఏజ్ లోనే విమర్శలను అధిగమిస్తూ, బుల్లితెర సెలబ్రిటీగా మారిన మన తెలుగు కుర్రోళ్ళు గురించి ఈ రోజు తెలుసుకుందాం. ఏసుదాస్, ఎస్పీ బాలు, కేఎస్ చిత్ర, సుశీలా ఇలా సంగీతానికి ప్రాణం పోసిన దిగ్గజాలని అందరికి తెలిసిన విషయమే. వీళ్ళు కొన్ని దశాబ్దాల యువతరానికి ఇన్స్పిరేషన్. అదే కోవలోకి చెందిన నేటి యువతారలు మన సుమంత్ బొర్ర, వెంకటేష్ వుప్పల. ఒకరికి ఎస్పీ బాలు ఇన్స్పిరేషన్ అయ్యితే మరొకరికి నాన్నే నా ఇన్స్పిరేషన్ అంటూ ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తున్నారు. అంతే కాదు, మ్యూజిక్ వరల్డ్ లో ఆరి తేరిన ఆదిత్య మ్యూజిక్ వారే స్వయంగా క్యూ కడుతున్నారు అంటే, టాలెంట్ తేనే పుట్ట లా ఉందని మనం అర్ధం చేసుకోవచ్చు. సుమంత్ బొర్ర పాట తో చిందేయ్యిస్తే, వెంకటేష్ వుప్పల మ్యూజిక్ తో అలరిస్తూ ప్రస్తుతం వీళ్ళు ఇద్దరు కలిసి చేసిన సాంగ్స్ యూట్యూబ్ లో ట్రేండింగ్ తో పాటు మిల్లియన్స్ వ్యూస్ హల్ చల్ చేస్తున్నాయి.

1) మీ ఇద్దరి జీవిత నేపధ్యం గురించి చెప్పండి?
వెంకటేష్ వుప్పల, సుమంత్ బొర్ర అంటే నేను మొదటి నుంచి ఉద్యోగాలు చేస్తున్నా, ఇద్దరం కూడా మ్యూజిక్ తో పాటు మంచి పాటలు ప్రేక్షకులకు అందించాలనే ప్యాషన్ తో ఇండస్ట్రీ కి వచ్చాము. మాకున్న ఆ ప్యాషన్ మాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. దాంతో నెవెర్ గివ్వప్ అనే ఏకైక సిద్ధాంతంతో ముందుకు పోతున్న మాకు ఎప్పుడూ కష్టమనిపించలేదు. అందుకే ఈ రోజు ఎంతో మంది ప్రేక్షకులు మమ్మల్ని ఆదరిస్తున్నారు. మాకు సెలవులు వచ్చిన టైంలో కూడా ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పాట రిలీజ్ చేయాలని తాపత్రయం ఉండేది. మేము ఏం చేసినా ఆనందపడుతూ సంతోషం గా చేసాం. అందుకే ఈ రోజు చాలా ఆనందాన్ని అనుభవిస్తున్నాము.

- Advertisement -

2) సుమంత్ బొర్ర మీ ఇద్దరి కలయిక ఎలా స్టార్ట్ అయ్యింది?
వెంకటేష్ వుప్పల నేను పంజాబ్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో చదువుతున్న టైం లో వెంకటేష్ నాకు టు ఇయర్స్ సీనియర్, తను నాకు ఎంతగానో మ్యూజిక్ లో బాగా ఎంకరేజ్ చేశాడు అందులోనూ స్టేజి మీద ఎన్నో పెర్ఫామెన్స్ చేశాము కాలేజీలో జరిగే ఈవెంట్లలో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేసాం. యూనివర్సిటీ వైస్ చ్యాన్స్లర్ సైతం మేము చేసే ప్రోగ్రామ్స్ చూసి మమ్మల్ని అప్రిసియేట్ చేశారు. అలా మా జర్నీ స్టార్ట్ అయింది.

3) సినిమా ఇండస్ట్రీ నే కెరీర్ గా ఎంచుకున్న మీ ఇద్దరికీ తల్లి తండ్రుల సపోర్ట్ ఉందా?
మా ఇద్దరి తల్లిదండ్రులు కూడా ఇందులో వెళ్ళితే సక్సెస్, ఎదుగుదల ఉండదు అని చెప్పడం జరిగింది. అయినా మేము మెల్లి మెల్లిగా ఇలా పాడుతూ వచ్చాము. దాంతో, ఇప్పుడిప్పుడే మాకు ఫ్యామిలీ నుంచి అలాగే ప్రేక్షకులు ఎదో కొత్త ప్రయత్నం చేస్తున్నారని ఎంకరేజ్మెంట్ చేయడంతో మాకెంతో ధైర్యాన్ని ఇచ్చింది. ఈ సపోర్టు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము

4) సుమంత్ బొర్రా, మీ పాటల ప్రస్థానం గురించి చెప్పండి?
మేము చేసే కంటెంట్ లో ఎలాంటి జోనర్ సాంగ్ అయినా సరే అది మెలోడీ ఆర్ ఫోక్ సాంగ్ కావచ్చు. ప్రేక్షకులకు నచ్చే విధంగా కంపోజ్ చేసి ఆ పాటను అందరూ పాడుకునే విధంగా ట్రెండ్ ను సెట్ చేస్తూ అడియన్స్ లో సిగ్నేచర్ గా మిగలాలి అన్నదే మా ముఖ్య ఉద్దేశ్యం.

5) వెంకటేష్ ఉప్పాల, మ్యూజిక్ డైరెక్టర్ గా మీ ప్రస్థానం గురించి చెప్పండి?
మా నాన్న కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం అయ్యన పేరు వుప్పల శ్రీనివాస్. నాన్న లాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి సంగీతం అంటే ఇష్టం మరియు ఆసక్తి. ఇంట్లో ఒక హాబీ గా తండ్రి అపుడపుడు కీబోర్డ్ ప్లే చేసేవాడు. కాలేజ్ కి వెళ్ళే వరకు కీబోర్డ్ క్లాస్‌లు నేర్పించాడు. కాని ఆ ఇంట్రెస్ట్ రాలేదు. కాలేజ్ లో గిటార్ కి ఎట్రాక్ట్ అయ్యాను. సాధారణ స్నేహితుడు డేగరా నుండి గిటార్ తీసుకోని నైట్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడిని. ఒక వన్ మంత్ లో గిటార్ బేసిక్ నేర్చుకొని, పాటలు ప్లే చేసేవాడిని. అట్లా నా ఇంట్రెస్ట్ మ్యూజిక్ బ్యాండ్ వరకు వెళ్ళింది. అక్కడ నుండి వెనక్కి చూడలేదు.

6) ఏకకాలంలో సంగీత దర్శకుడిగా, గాయకుడిగా, గీతరచయితగా దూసుకెళ్తున్నారు కదా? ఇంత సమయాన్ని ఎలా కేటాయించుకుంటున్నారు?
ఎందుకు ఇంత సమయాన్ని కేటయిస్తున్నాను అంటే, ఒక నార్మల్ పర్సన్స్ కి మంచి చేయాలని చెప్తే దాన్ని పట్టించుకోరు. కానీ మ్యూజిక్ ద్వారా ఒక ఎమోషన్ తో కలిపి చెప్తే వారికి ఆ మెసేజ్ చాలా ఈజీ గా చేరుతుంది. ఇలా ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేయాలనేది మా మెయిన్ మోటో.

7) మీ ఇద్దరికీ జీవితంలో ఆనందాన్నిచ్చిన సంఘటన?
2019లో “ఎలా మరి ఇక రావా” పాటను ఎలా రిలీజ్ చేయాలని ఇద్దరు డిస్కస్ చేసుకునే టైంలో ఆదిత్య మ్యూజిక్ వారు మా సాంగ్ విజువల్స్, కంపోజిషన్ ని చూసి చాలా హ్యాపీగా ఫీలై మమల్ని ఎంకరేజ్ చేస్తూ ఈ సాంగ్ ను రిలీజ్ చేస్తామని చెప్పారు. ఆలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏమున్నా సరే మా దగ్గర తీసుకురండి మేము సపోర్ట్ చేస్తాము అన్నారు. దాంతో “ఎలా మరి ఇక రావా” మ్యూజిక్ రిలీజ్ చేశాం. యూట్యూబ్ లో కూడా ట్రెండింగ్ కు వెళ్ళింది. ఆ పాటకు ప్రేక్షకుల నుండి ప్రశంసలు ఇచ్చారు. అలాగే మళ్లీ పడిపోయా సాంగ్ కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

8) మీరు ఇద్దరు పొందిన ఉత్తమమైన ప్రశంస?
అయితే ఎలా మరి ఇక రావా పాటను దర్శకులు మెహర్ రమేష్, దీపు గార్లు రిలీజ్ చేయగా పడిపోయా సాంగ్ ను గీతా భాస్కర్, తరుణ్ భాస్కర్ గారి తల్లి రిలీజ్ చేశారు అలాగే రాజ్ కందుకూరి, ఇలా అందరూ ఎన్నో ప్రశంసలు ఇచ్చారు. రీసెంట్ గా మా ఇద్దరి కాంబినేషన్ లో తల్లాడ సాయి దర్శకత్వంలో దేశభక్తికి సంబంధించిన షార్ట్ ఫిలిం ప్రీమియర్ జరిగింది దాంట్లో మేము నువ్వే ఒక సైన్యం అనే టైటిల్ సాంగ్ ను కంపోజ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. దానికి థియేటర్లో జనం ఎంతో ప్రశంసలు కురిపించారు. అవి చూసి పలు చ్యానెల్ లో మా గురించి టెలికాస్ట్ చేయడం జరిగింది. ఇలా మరెన్నో న్యూస్ పేపర్లో మా ఇద్దరి గురించి రాయడం జరిగింది.

9) ఫ్యూచర్ లో మీ ఇద్దరు కలిసి ఏదైనా ప్ల్యాన్ చేయబోతున్నారా?
సుమంత్ బొర్ర మా ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా కమర్షియల్ సాంగ్స్ తో పాటు అన్ని రకాల పాటలను మంచి మంచి థీమ్స్ తో సాంగ్స్ రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అదియే వేడుక సాంగ్, అలాగే ఒక ఫార్మర్ కనెక్ట్ అయ్యే సాంగ్, అలాగే నువ్వే ఒక సైన్యం, మాయ చేసావే సాంగ్ ఇలా ఎన్నెన్నో అద్భుతమైన పాటలు ఇండిపెండెంట్ మ్యూజిక్ ద్వారా మేము తీసుకురాబోతున్నాం. అవన్నీ కూడా జనాలకు కచ్చితంగా నచ్చుతాయి. మేము ఏది చేసినా సరే యూనిక్ స్టైల్లో సిగ్నేచర్ మూమెంట్ ఉండేలా ఇండిపెండెంట్ మ్యూజిక్ లో పాటలు ఉంటాయని ఆశిస్తున్నాము.

10) మీరు ఇద్దరు పొందిన పురస్కారాల గురించి చెప్పండి?
మా జర్నీ లో ఫస్ట్ ‘ఎలా మరి ఇక రావా’ సాంగ్ తో స్టార్ట్ చేశాము. ఈ పాటను దర్శకులు మెహర్ రమేష్ గారు, దీపు గారు స రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాట నచ్చడంతో 2019 లో ఆదిత్యా మ్యూజిక్ వారు ముందుకు వచ్చి ప్రెజెంట్ చేయడం జరిగింది. దాంతో, ఈ పాట కూడా ఎంతో ప్రేక్షకాధారణ పొందింది. ఆ తరువాత ఈ రోజు పడిపోయా సాంగ్ రిలీజ్ చేశాం. ఇంకా, ఐఎఫ్ పి (ఇండియన్ ఫిలిం ప్రాజెక్టు లెవెల్) కాంపిటీషన్ లో తెలుగు నుంచి మాకు ఫస్ట్ టైం ప్లాటినమ్ అవార్డు రావడం చాలా ఆనందకరమైన విషయం. అలాగే, మా అప్ కమింగ్ పాట “వేడుక కనరో” మా ఇంట అలాగే మాయ చేశావే, నువ్వే ఒక సైన్యం ఇలా మరెన్నో పాటలతో అందరినీ అలరిస్తాం.

ఇండస్ట్రీలో మా ఇద్దరిలో ఎవరో ఒకరు సెటిల్ అవుతారు అనుకున్నాము కానీ, మా ఇద్దరికీ కూడా ఆ అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఇవే కాకుండా ఇంకా త్రీ సాంగ్స్ కి కంపోజిషన్ లిరిక్స్ రాయడం జరుగుతుంది. వీటితోపాటు 7 సాంగ్స్ చేయడానికి ఆదిత్య మ్యూజిక్ తో ఒప్పందం చేసుకోవడం జరిగింది.

11) వెంకటేష్ వుప్పల, సుమంత్ బొర్ర చివరగా కళామతల్లి గురించి మీ మాటల్లో?
ఈ ప్రపంచంలో డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కానీ, డబ్బుతో ఆనందం వస్తుందో రాదో తెలీదుగానీ మేమైతే ఫ్యాషన్ తో చేస్తున్నాం. మేము చేసే పాటలకు ప్రేక్షకులు కామెంట్స్ రూపంలో ప్రోత్సహిస్తుంటే వచ్చే ఆనందం మాములుగా కాదు. అందుకే మా కలలను నెరవేర్చుకోవాలి, ఎటువంటి అడ్డంకులు వచ్చినా సరే గమ్యాన్ని చేరుకునే మా ప్రయత్నం ఆపము. అదే విధంగా కళామతల్లికి తగిన రెస్పెక్ట్ ఇస్తూ చేయవలసిన పని చేసుకుంటూ పొతే మనకు తగిన గుర్తింపును ఆటోమెటిక్ గా వస్తుంది. మన కష్టం కూడా వృధా కాదు అని మేము మొదటి నుండి నమ్ముతున్నాము.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All