Homeటాప్ స్టోరీస్అశ్వద్ధామ మూవీ రివ్యూ

అశ్వద్ధామ మూవీ రివ్యూ

అశ్వద్ధామ మూవీ రివ్యూ
అశ్వద్ధామ మూవీ రివ్యూ

మూవీ రివ్యూ: అశ్వద్ధామ
నటీనటులు: నాగ శౌర్య, మెహ్రీన్ తదితరులు
దర్శకత్వం: రమణ తేజ
నిర్మాత: ఉష మూల్పూరి
సంగీతం: శ్రీ చరణ్ పాకల
విడుదల తేదీ: జనవరి 31, 2020
రేటింగ్: 3/5

నాగ శౌర్య హిట్ కొట్టి చాలా కాలమైంది. ఈసారి తనే కథ రాసుకుని ఫుల్ లెంగ్త్ మాస్ సినిమా ప్రయత్నించాడు. డీసెంట్ బడ్జెట్ తో తెరకెక్కించిన అశ్వద్ధామ ప్రేక్షకుల ఆసక్తిని ఆకర్షించింది. ఈరోజే ఈ సినిమా విడుదలైంది. మరి అశ్వద్ధామ విషయంలో కాన్ఫిడెంట్ గా ఉన్న అశ్వద్ధామ సంగతి ఏంటి?

- Advertisement -

కథ:
గణ (నాగ శౌర్య) యూఎస్ నుండి తన చెల్లెలి ఎంగేజ్మెంట్ కోసం వస్తాడు. అయితే పెళ్లి కాకుండానే తన చెల్లి ప్రేగ్నంట్ అన్న షాకింగ్ విషయం తెలుస్తుంది. తన చెల్లెలు ప్రేగ్నంట్ ఎలా అయిందన్న విషయాన్ని ఛేదించడం మొదలుపెడతాడు. ఒకటి తర్వాత ఒకటిగా క్లూస్ ఛేదించడం మొదలుపెడతాడు. మరోవైపు హైదరాబాద్ లో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నట్లు తెలుసుకుంటాడు. ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారు? దేనికోసం చేస్తున్నారు? గణ దీన్ని ఛేదించడంలో సక్సెస్ అయ్యాడా లేడా అన్నది తెరమీదే చూడాలి.

నటీనటులు:
నాగ శౌర్య తన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు. యాక్షన్ సీన్స్ లో మెప్పించాడు. ఎమోషనల్ సీన్స్ లో కూడా రాణించాడు. మొత్తంగా మాస్ హీరోగా రాణించాలని శౌర్య చేసిన ప్రయత్నం ఫలించిందనే చెప్పాలి. మెహ్రీన్ కు పెద్ద స్కోప్ లేకపోయినా ఉన్నంతలో బానే చేసింది. జిష్షు సేన్ గుప్తా రోల్ సినిమాకే హైలైట్ గా చెప్పుకోవచ్చు. విలన్ రోల్ లో జీవించేసాడు. అతనికి చెప్పిన డబ్బింగ్ కూడా ఆకట్టుకుంది. హరీష్ ఉత్తమన్ రోల్ కూడా డిఫరెంట్ గా ఉండి ఆకట్టుకుంది. మిగిలిన నటీనటులు కూడా ఆకట్టుకున్నారు.

సాంకేతిక నిపుణులు:
ఈ చిత్ర కథను స్వయంగా నాగ శౌర్య రాసుకున్న సంగతి తెల్సిందే. కథ వరకూ ఇందులో ఆసక్తికర అంశాలకు స్కోప్ బానే ఉంది. అయితే స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొన్ని లాజిక్స్ మిస్ అయ్యాయి. అది సినిమాపై ఎఫెక్ట్ చూపించింది. సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమాకు ఒక కొత్త లుక్ రావడానికి సినిమాటోగ్రఫీ ఉపయోగపడింది. ఎడిటింగ్ షార్ప్ గా ఉంది. తక్కువ రన్ టైం ఉండడం వల్ల సినిమాపై ఎఫెక్ట్ పడదు. సంగీతం సినిమాకు ప్లస్ గా నిలిచింది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా వర్కౌట్ అయింది. హీరోయిజం ఎలివేషన్స్ కు ఉపయోగపడింది. కొత్త దర్శకుడైనా రమణ తేజ ఈ చిత్రాన్ని బానే హ్యాండిల్ చేసాడు. యాక్షన్ సీన్స్, సెంటిమెంటల్ సీన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి.

విశ్లేషణ:
మాస్ బొమ్మగా విడుదలైన అశ్వద్ధామ యాక్షన్ సీన్స్ వరకూ మెప్పిస్తుంది. అక్కడక్కడా కొన్ని థ్రిల్స్ ఉన్నప్పటికీ మిగిలిన భాగం బోర్ కొట్టించడం సినిమాకు ప్రతికూలంగా మారింది. యాక్షన్ లవర్స్ కు ఈ సినిమా పండగ లాంటిదే. రెగ్యులర్ ఎంటర్టైన్మెంట్ విషయంలో కూడా ఈ చిత్రం వెనుకపడింది. మొత్తంగా అశ్వద్ధామ సినిమా యావరేజ్ ఎంటర్టైనర్ గా నిలిచి యాక్షన్ లవర్స్ ను ఆకట్టుకుంటుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All