Sunday, November 27, 2022
Homeటాప్ స్టోరీస్ఆ సినిమా ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్న నాగ శౌర్య

ఆ సినిమా ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్న నాగ శౌర్య

ఆ సినిమా ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్న నాగ శౌర్య
ఆ సినిమా ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసంటున్న నాగ శౌర్య

యంగ్ హీరో నాగ శౌర్య ఇప్పుడు సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తన నెక్స్ట్ సినిమా అశ్వథామ అసలు గురి తప్పే సమస్యే లేదని ధీమా ప్రదర్శిస్తున్నాడు. ఈ సినిమాకు కథ కూడా తానే ఇచ్చి, సినిమాను కూడా తానే నిర్మించడంతో అదనపు బాధ్యత తీసుకుని సినిమాను ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తున్నాడు. నాగ శౌర్య కెరీర్ లో రీసెంట్ మూడు ప్లాపులు ఉన్నా కానీ అతని మార్కెట్ చెక్కుచెదరకపోవడం గమనార్హం. ఛలో సినిమాతో వచ్చిన మార్కెట్ అలానే ఉంది. అశ్వథామ దాదాపుగా 16 కోట్లకు బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా సమాజంలో జరుగుతున్న దారుణమైన సంఘటనలను ఎత్తి చూపుతుందని, దానికి పరిష్కారం ఇచ్చే ప్రయత్నం కూడా చేశామని చెప్తున్నాడు నాగ శౌర్య. ఇంకా ఈ సినిమా గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.

- Advertisement -

ఈ సినిమాకు ముందు వచ్చిన నర్తనశాల సినిమా ఐరా క్రియేషన్స్ పతాకంపైనే తెరకెక్కిన సంగతి తెల్సిందే. ఈ సినిమాను ఎంతో నమ్మి చేసిన నాగ శౌర్య అండ్ కుటుంబం ఆ చిత్ర ప్లాప్ తో తీవ్రంగా కుంగిపోయారట. ఇంట్లో ఎవరైనా చనిపోతే ఎలాంటి వాతారవరణం ఉంటుందో అలాంటి వాతావరణం తన ఇంట్లో ఆరు నెలల పాటు చూశానని చెప్పాడు ఈ హీరో. డబ్బులు పోయినందుకు బాధపడలేదు. అమ్మానాన్నలను తలదించుకునేలా చేసానని బాధపడ్డాను. వాళ్ళు కూడా కొడుక్కి మంచి సినిమా ఇవ్వలేకపోయామని కృంగిపోయారు. ఆ బాధ నుండి బయటపడడానికి దాదాపు ఆరు నెలలు పట్టింది అని చెప్పుకొచ్చాడు.

అయితే నర్తనశాల ప్లాప్ అవుతుందని తనకు ముందే తెలుసనీ, అయితే ఒక వ్యక్తికి ఇచ్చిన మాట కోసం ఆ సినిమా చేయాల్సి వచ్చిందని చెప్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరనేది మాత్రం చెప్పలేదు. మాట ఇచ్చాక తప్పితే ఉన్నా ఒకటే చనిపోయినా ఒకటే అనుకున్నానని అందుకే పోతుందని తెలిసినా ఆ సినిమా చేసినట్లు చెప్పాడు. అయితే ఇకపై అలాంటి పొరబాట్లు మాత్రం చేయనని అంటున్నాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts