Homeగాసిప్స్వెంకీ మామ రిలీజ్ తోనే ఆ విషయంలో క్లారిటీ

వెంకీ మామ రిలీజ్ తోనే ఆ విషయంలో క్లారిటీ

వెంకీ మామ రిలీజ్ తోనే ఆ విషయంలో క్లారిటీ
వెంకీ మామ రిలీజ్ తోనే ఆ విషయంలో క్లారిటీ

ఏదైనా సినిమాను రీమేక్ చేస్తున్నామంటే ఒరిజినల్ లోని సోల్ ను క్యారీ చేయడం అనేది అన్నిటికన్నా ముఖ్యమైనది. అదే చిత్ర విజయాన్ని ప్రాధమికంగా నిర్ణయిస్తుంది. అయితే సోల్ ను దెబ్బతీసి రీమేక్ చేస్తే ఆ సినిమా విజయవంతమవ్వడం మాట అటుంచి నవ్వులపాలు అవ్వాల్సి వస్తుంది. ఇప్పుడిదంతా దేని గురించి అనేగా మీ సందేహం. ఇంకా దేని గురించి తమిళంలో ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయిన అసురన్ ను తెలుగులో రీమేక్ చేస్తున్న విషయం తెల్సిందే. వెంకటేష్ ఈ సినిమా చూసాక నచ్చి ఎంతో ముచ్చటపడి ఈ సినిమాను సురేష్ బాబు చేత కొనిపించాడు. ముందునుండీ ఈ రీమేక్ పై వస్తోన్న మొదటి సందేహం, సాఫ్ట్ ఇమేజ్ ఉండి, ఫ్యామిలిస్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న వెంకటేష్ వంటి హీరోకు సినిమా అంతటా రా యాక్షన్ ఉన్న అసురన్ లాంటి సినిమా ఎలా సరిపోతుందనే. దీనికి తోడు అసురన్ ను రీమేక్ చేయడానికి శ్రీకాంత్ అడ్డాల ను దర్శకుడిగా ఎంచుకున్నారు. కెరీర్ మొదటినుండి లైటర్ వీన్ లో సినిమాలు తీయడం అలవాటున్న శ్రీకాంత్ అడ్డాల సినిమా అంతటా ఇంటెన్సిటీ మైంటైన్ అయ్యే ఇలాంటి కథను ఎలా బ్యాంఫైల్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

అయితే వీటికి సమాధానమన్నట్లుగా ఒక కొత్త రూమర్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. అసురన్ లో ధనుష్ 20 ఏళ్ల కుర్రాడికి తండ్రిగా కనిపిస్తాడు. సో.ఏజ్ పరంగా ఎలాంటి ఇబ్బందీ ఉండదని వెంకటేష్ భావించి ఉండవచ్చు. అయితే ఫ్లాష్ బ్యాక్ లో యువకుడిగా కనిపించాలి వెంకీ. మరి అది ఎలా మ్యానేజ్ చేస్తారన్నది ఇంకా తెలీదు. మరోవైపు ఈ రీమేక్ ను ఒరిజినల్ లో ఉన్నంత ఇంటెన్స్ గా కాకుండా కొంచెం లైటర్ వీన్ లో తీసుకెక్కించాలని నిర్ణయించుకున్నారట. ఆ ఇంటెన్సిటీని, ఆ రా నెస్ ను కొంత టోన్ డౌన్ చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. ఇదే కనుక నిజమైతే అసురన్ రీమేక్ తో సురేష్ బాబు అండ్ కో పెద్డ రిస్క్ చేస్తున్నట్లే.

- Advertisement -

మరోవైపు తెలుగు వెర్షన్ ను దాదాపు 13-15 కోట్లలో తెరకెక్కించాలని సురేష్ బాబు ఆర్డర్ వేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే దాంట్లో కూడా నిజం లేదని తెలుస్తోంది. నిజానికి సురేష్ బాబు ఒక స్ట్రాటజీ ని ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామ సినిమా ఫలితాన్ని బట్టి సురేష్ బాబు, అసురన్ రీమేక్ కు బడ్జెట్ ను కేటాయించనున్నట్లు తెలుస్తోంది. వెంకీ మామ సినిమాకు భారీ బడ్జెట్ ను కేటాయించారు. అది కనుక విజయవంతమైతే సురేష్ బాబుకు ధైర్యమొచ్చి మరోసారి ఆ స్థాయి బడ్జెట్ పెట్టే అవకాశాలు ఉన్నాయి. అందుకే డిసెంబర్ 13న వెంకీ మామ రిలీజ్ అయ్యాక తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. డిసెంబర్ చివరి వారం నుండి కానీ జనవరి మొదటి వారం నుండి కానీ అసురన్ రీమేక్ షూటింగ్ మొదలవుతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All