Homeగాసిప్స్వెంకీ మామ అసురన్ కథలో వేలు పెడుతున్నాడా?

వెంకీ మామ అసురన్ కథలో వేలు పెడుతున్నాడా?

వెంకీ మామ అసురన్ కథలో వేలు పెడుతున్నాడా?
వెంకీ మామ అసురన్ కథలో వేలు పెడుతున్నాడా?

విక్టరీ వెంకటేష్ ఇప్పుడు రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకటి వెంకీ మామ అయితే రెండోది అసురన్ రీమేక్. వెంకీ మామ షూటింగ్ ఎప్పుడో పూర్తయినా ఇంకా రిలీజ్ డేట్ గురించి క్లారిటీ రాలేదు. డిసెంబర్ లో విడుదల చేద్దామన్నా, సంక్రాంతికి తీసుకువద్దామనుకున్నా కానీ గ్యాప్ లేదు. ఇప్పటికే క్రిస్మస్ కు రెండు సినిమాలు, సంక్రాంతికి నాలుగు సినిమాలు షెడ్యూలై ఉన్నాయి. పోనీ నాన్ హాలిడే రిలీజ్ కు వెళదామంటే డిస్ట్రిబ్యూటర్లు ఒప్పుకోవట్లేదు. దీంతో పాలుపోవని స్థితిలో వెంకీ మామ నిర్మాత సురేష్ బాబు ఉన్నాడు. ఈ సినిమాలో తన పనిని పూర్తి చేసిన వెంకటేష్ ఇప్పుడు తన తర్వాతి సినిమాపై దృష్టి పెట్టాడు. వెంకటేష్ అసురన్ రీమేక్ ను ఒప్పుకున్న విషయం తెల్సిందే. తమిళంలో కల్ట్ హిట్ అయిన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చేయనున్న సంగతి తెల్సిందే. నిర్మాత సురేష్ బాబు ఈ చిత్ర హక్కులను ఫ్యాన్సీ ధరకు కొనుగోలు చేసాడు. చాలా రా గా ఇంటెన్స్ గా ఉండే అసురన్ లో హింస కూడా ఎక్కువగానే కనిపిస్తుంది. అలాంటి సినిమాలో వెంకటేష్ లాంటి సాఫ్ట్ ఇమేజ్ ఉన్న హీరో అంటే అది నిజంగానే సాహసమనే చెప్పాలి.

అయితే అసురన్ లో తమిళ నేటివిటీ కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే ఈ చిత్ర రీమేక్ ను తెలుగువారి అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసే పనిలో పడ్డారు. ప్రస్తుతం సురేష్ బాబు, రానాతో కలిసి యూఎస్ వెళ్ళాడు. సో, వెంకటేష్ దగ్గరుండి మరీ అసురన్ కథలో భాగం పంచుకుంటున్నాడు. ఏది వర్కౌట్ అవుతుంది ఏది అవ్వదు వంటి సూచనలిస్తూనే తన ఇన్పుట్స్ కూడా జత చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో వెంకటేష్ ఇలా పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసిన సినిమా మరొకటి లేకపోవడంతో టీమ్ కూడా ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

సురేష్ బాబు యూఎస్ నుండి తిరిగి వచ్చేలోగా వెంకటేష్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయాలని అనుకుంటున్నాడట. వీలైనంత తొందర్లో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టాలని ఉత్సాహంగా ఉన్నాడు. దీన్ని బట్టి అసురన్ ను వెంకటేష్ పూర్తిగా నమ్ముతున్నాడన్నది అర్ధమవుతోంది. అసురన్ రీమేక్ ను శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయనున్నాడు. శ్రీకాంత్ కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ మెయిన్ గా సినిమాలు తీసే వ్యక్తి. అటువంటి దర్శకుడు ఇలాంటి హింసాత్మక చిత్రాన్ని ఎలా డైరెక్ట్ చేయనున్నాడు అన్నది ఆసక్తికరంగా మారింది. పైగా శ్రీకాంత్ భారీ డిజాస్టర్ ఇచ్చి ఉన్నాడు. మూడేళ్ళుగా సినిమా అన్నదే లేదు. కాన్ఫిడెన్స్ బాగా లో గా ఉన్న శ్రీకాంత్ అడ్డాలకు వెంకటేష్ స్క్రిప్ట్ విషయంలో వేలు పెడుతున్నా ఏమి అనలేని పరిస్థితి.

వెంకటేష్ కు 70 సినిమాలకు పైగా చేసిన అనుభవముంది కాబట్టి ఇక్కడ వెంకటేష్ మాట చెల్లుతోంది. అసురన్ రీమేక్ లో కొత్త ముఖాలను ఎక్కువగా తీసుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెల్సిందే. ఇది కూడా వెంకటేష్ నిర్ణయమే అంటున్నారు. ఇలా అసురన్ ను పూర్తిగా ఓన్ చేసేసుకున్నాడు మన వెంకీ మామ.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All