
`సాహో` తరువాత ప్రభాస్ హీరోగా ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్‌తో పాటు గోపీ కృష్టామూవీస్ బ్యానర్‌పై కృష్ణంరాజు కూడా ఓ భాగస్వామిగా వ్యవహరిస్తున్నారు. కె. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం పిరియాడిక్ లవ్‌స్టోరీగా ఓ సరికొత్త ప్రపంచం నేపథ్యంలో తెరకెక్కుతోంది.
పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరో ప్రభాస్‌కు తల్లిగా `మైనే ప్యార్ కియా` ఫేమ్ భాగ్యశ్రీ కనిపించనున్నారు. ఇటీవలే జార్జియాలో కీలక షెడ్యూల్‌ని పూర్తి చేసి టీమ్ సేఫ్‌గా ఇండియా తిరిగి వచ్చింది. మరికొంత భాగం చిత్రీకరణ బ్యాలెన్స్‌గా వుంది. ఇదిలా వుంటే ప్రభాస్ 21ని ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి. అశ్వనీదత్ తెరకెక్కించనున్నారు.
అత్యంత భారీ స్థాయిలో తెరపైకి రానున్న ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ మొదటుపెట్టినట్టు తెలిసింది. అత్యతం భారీ బడ్జెట్‌తో జానపద చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రంలో విలన్‌గా స్టైలిష్ విలన్ అరవింద స్వామి నటించే అవకాశం వుందని తాజా న్యూస్. ఇటీవల కథ విన్న అరవిందస్వామి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. రామ్‌చరణ్ నటించిన `ధృవ` చిత్రంలో అరవిందస్వామి విలన్‌గా నటించిన విషయం తెలిసిందే.