
`బాహుబలి` వంటి సంచలన చిత్రం తరువాత ప్రభాస్ స్థాయి మారిపోయింది. దానికి తగ్గట్టే ఆ తరువాత చేసిన `సాహో` చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించిన విషయం తెలిసిందే. సుజీత్ దర్శకత్వం వహించి ఈ చిత్రం ప్రభాస్ కెరీర్‌లోనే మరో రేంజ్ సినిమా అనిపించుకుంది. అయితే భారీ అంచనాల మధ్య విఉదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేకపోయింది.
అయితే యువీ క్రియేషన్స్ అత్యంత భారీ వ్యయంతో నిర్మించిన ఈ చిత్ర శాటి లైట్ రైట్స్‌ని మాత్రం ఇంత వరకు ఏ ఎంర్‌టైన్‌మెంట్ ఛానల్‌కి ఇవ్వలేదని గత కొన్ని నెలలుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈ చిత్ర శాటిలైట్ హక్కులు చిత్ర బృందం ఏ ఛానల్‌కి ఇవ్వలేదట. కారణం తక్కువగా కోట్ చేయడమే అని తెలిసింది.
తాజాగా ఓ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్ తెలుగు వెర్షన్‌ను 12 కోట్లకు తీసుకున్నట్టు తెలిసింది. మిగతా వెర్షన్‌లకు 8 కోట్లు వచ్చాయట. మొత్తం కలిసి శాటిలైట్ రైట్స్ రూపంలో ఈ చిత్రానికి 20 కోట్ల రావడం విశేషమని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.