Homeటాప్ స్టోరీస్హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ ఫై HRC కి పిర్యాదు..

హీరో విశ్వక్ సేన్ చేసిన ప్రాంక్ ఫై HRC కి పిర్యాదు..

arun-kumar-file-nuisance-case-against-hero-vishwak-sen
arun-kumar-file-nuisance-case-against-hero-vishwak-sen

ప్రస్తుతం ప్రాంక్‌ వీడియోలు విపరీతమవుతున్నాయి. సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేస్తే చాలు మొదటగా ఇవే కనిపిస్తున్నాయి. చిన్న , పెద్ద, అమ్మాయిలు , అబ్బాయిలు ఇలా తేడాలు లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాంక్ లు చేస్తూ వాటిని వైరల్ గా మారుస్తున్నారు. వీటిని చూసే కొంతమంది నిజమే అని భయపడితే..మరికొంతమంది ఫేక్ అని తెలిసి దూరం చేస్తున్నారు. ఒక్కోసారి వారి కళ్ల ముందు నిజంగా జరుగుతున్నప్పటికీ వాటికే ఫ్రాంక్ అని పట్టించుకోవడం లేదు. దింతో జరగరాని అనర్థం జరుగుతుంది.

ఈ మధ్య దర్శకనిర్మాతలు, హీరోలు సైతం తమ సినిమాల ప్రమోషన్ కోసం ప్రాంక్‌ల వైపు వెళుతున్నారు. తాజాగా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్ సేన్ చేసిన ఓ ప్రాంక్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. విద్యా సాగర్‌ చింత దర్శకత్వం వహించిన ఈ సినిమా మే 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేసింది.

- Advertisement -

హీరో విశ్వ‌క్ సేన్ ఫిలింన‌గ‌ర్ రోడ్డులో కారులో వెళుతుంటే.. ఓ యువ‌కుడు కారుకు అడ్డంగా వచ్చి నడి రోడ్డుపై పడుకున్నాడు. విశ్వ‌క్ సేన్ కారు దిగి ఇదేంటి అని అడగ్గా.. నాకు అర్జున్ కుమార్ అల్లం కావాలి, ఎక్కడ ఉన్నాడు అంటాడు. బ్రో నేనే అని విశ్వ‌క్ సేన్ అనగా.. నువ్ విశ్వ‌క్ సేన్, నాకు అర్జున్ కుమార్ కావాలి అంటాడు. ఎవరు ఎంత చెప్పినా అతడు వినడు. చివరకు ‘అల్లం అర్జున్ కుమార్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు మా ఓడిని పెళ్లి చేసుకోకుంటే.. పెట్రోల్‌ పోసుకొని సూసైడ్‌ చేసుకుంటా’ అని అంటాడు. దాంతో విశ్వ‌క్ సేన్ అతడిని తన కారులో ఎక్కించి.. ఆటోలో వెళ్లిపోతాడు. ఈ వీడియో ను చూసి అంత విశ్వక్ సేన్ ఫై చిత్ర యూనిట్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినిమా ప్రొమోషన్ కోసం ఇలా చేస్తారా..? ప్రాంక్‌ పేరుతో పబ్లిక్‌ ప్లేస్‌లో న్యూసెన్స్‌ చేయడం ఏంటి.? సినిమా ప్రమోషన్ కోసం పబ్లిక్ ను ఇబ్బంది పెడతారా..? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటన పట్ల అడ్వకెట్ అరుణ్ కుమార్ HRC కి పిర్యాదు చేసారు. సినిమా ప్రొమోషన్ కోసం ఇలా పబ్లిక్ ను ఇబ్బందికి గురి చేస్తారా..? బహిరంగ ప్రదేశాల్లో ప్రమోషన్స్ కు అనుమతి ఇవ్వకూడదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

విశ్వక్ సేన్ ప్రాంక్ వీడియో ను లైట్ తీసుకుంటున్న నెటిజన్లు

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All