
ఈరోజుల్లో సినిమాను ఎంత బాగా నిర్మించాం..ఎంత బాగా తీసాం కాదు జనాల్లోకి ఎంత బాగా తీసుకెళ్ళాం అనేది ముఖ్యం. సినిమాకు సరైన ప్రమోషన్ చేయకపోతే పెద్ద స్టార్ సినిమైన జనాలు లైట్ తీసుకుంటారు. అందుకే సినిమా రిలీజ్ కు నెల రోజులు ఉందనగానే చిత్ర నటి నటులు సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు రకరకాలుగా ఈవెంట్స్ చేస్తూ ప్రమోషన్ చేస్తుంటారు. తాజాగా హీరో విశ్వక్ సేన్ మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియా లో విపరీతమైన ప్రాంక్ ను నమ్ముకొని తన సినిమాను ప్రమోషన్ చేసాడు. కాకపోతే ఈ వీడియో ఫై కొంతమంది విమర్శలు చేస్తుంటే..నెటిజన్లు మాత్రం చాల లైట్ గురు అంటున్నారు.
వెళ్ళిపోమాకే చిత్రంతో ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి..ఈ నగరానికి ఏమైంది సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. ఆ తర్వాత ఫలక్‌నుమాదాస్ చిత్రం యూత్ కు దగ్గర చేసింది. ఇక గత ఏడాది పాగల్ తో వచ్చిన విశ్వక్…ఇక ఇప్పుడు అశోకవనంలో అర్జున కల్యాణం తో మే 06 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ లో భాగంగా ఓ ఫ్రాంక్ వీడియో చేసింది.
హీరో విశ్వక్ సేన్ ఫిలింనగర్ రోడ్డులో కారులో వెళుతుంటే.. ఓ యువకుడు కారుకు అడ్డంగా వచ్చి నడి రోడ్డుపై పడుకున్నాడు. విశ్వక్ సేన్ కారు దిగి ఇదేంటి అని అడగ్గా.. నాకు అర్జున్ కుమార్ అల్లం కావాలి, ఎక్కడ ఉన్నాడు అంటాడు. బ్రో నేనే అని విశ్వక్ సేన్ అనగా.. నువ్ విశ్వక్ సేన్, నాకు అర్జున్ కుమార్ కావాలి అంటాడు. ఎవరు ఎంత చెప్పినా అతడు వినడు. చివరకు ‘అల్లం అర్జున్ కుమార్‌కి 33 ఏళ్లు వచ్చినా పెళ్లి కాలేదు. నేను అసలు తట్టుకోలేకపోతున్నా. రెండు తెలుగు రాష్ట్రాల అమ్మాయిలు మా ఓడిని పెళ్లి చేసుకోకుంటే.. పెట్రోల్ పోసుకొని సూసైడ్ చేసుకుంటా’ అని అంటాడు. దాంతో విశ్వక్ సేన్ అతడిని తన కారులో ఎక్కించి.. ఆటోలో వెళ్లిపోతాడు. ఇక ఈ ప్రాంక్ వీడియో ఫై కొంతమంది విమర్శిస్తూ వస్తుంటే..నెటిజన్లు, అభిమానులు మాత్రం దీనిని వివాదస్పదం చేయాల్సిన అవసరం లేదు అంటున్నారు. ఇలాంటి ఎన్ని ప్రాంక్ వీడియో లు వచ్చాయని..సామాన్య ప్రజల నుండి పొలిటికల్ లీడర్స్ వరకు ఇలాంటివి చేసారని , చేపించారని కామెంట్స్ వేస్తున్నారు. ఈ క్రమంలో టీవీ 9 స్టూడియో లో దీని ఫై డిబేట్ జరుగుతుండగా ..అందులో విశ్వక్ సేన్ పాల్గొన్నాడు. డిబేట్ కొనసాగుతుండగా విశ్వక్ సేన్ డిప్ ప్రెస్ డ్ పర్సన్ అని దేవి అన్నారు. దీంతో విశ్వక్ సేన్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. తనను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారని ఆమె నిప్పులు చెరిగాడు విశ్వక్. అయితే.. దీనిపై దేవీ నాగవల్లి కూడా సీరియస్ గా రియాక్ట్ అయి…. విశ్వక్ సేన్ ను స్టూడియోను పంపించేసింది. ప్రస్తుతం ఈ ఘటన హాట్ టాపిక్ గా మారింది.
