Homeటాప్ స్టోరీస్అర్జున్ సురవరం మూవీ రివ్యూ

అర్జున్ సురవరం మూవీ రివ్యూ

అర్జున్ సురవరం మూవీ రివ్యూ
అర్జున్ సురవరం మూవీ రివ్యూ

నటీనటులు: నిఖిల్ సిద్దార్ధ్, లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య, పోసాని, తరుణ్ అరోరా తదితరులు.
దర్శకత్వం: టి ఎన్ సంతోష్
నిర్మాత‌లు: రాజ్ కుమార్ ఆకెళ్ళ, వేణు గోపాల్ కావియా
సంగీతం: సామ్ సిఎస్
సినిమాటోగ్రఫర్: సూర్య
ఎడిటర్: నవీన్ నూలి
రేటింగ్: 2.5/5

ఒక సినిమాకు ఎన్ని కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయో వాటన్నిటినీ ఎదుర్కొన్న సినిమా అర్జున్ సురవరం. దాదాపు ఏడాదికి పైగా వాయిదా పడిన అర్జున్ సురవరం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి హిట్ కోసం ఎదురుచూస్తోన్న నిఖిల్ కు ఈ క్రైమ్ థ్రిల్లర్ ఎటువంటి ఫలితాన్ని అందించింది అన్నది రివ్యూలో చూద్దాం.

- Advertisement -

కథ:
అర్జున్ లెనిన్ సురవరం (నిఖిల్) ఇంట్లో సాఫ్ట్ వేర్ జాబ్ అని అబద్ధం చెప్పి టివి 99లో జర్నలిస్ట్ గా పనిచేస్తుంటాడు. బిబిసిలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అవ్వాలనేది అతని కల. అయితే ఈ క్రమంలో అర్జున్ కు కావ్య (లావణ్య త్రిపాఠి)తో పరిచయం ఏర్పడి ప్రేమకు దారితీస్తుంది. అంతలోనే బిబిసిలో కూడా ఆఫర్ వస్తుంది. ఇలా లైఫ్ హ్యాపీగా సాగిపోతున్న సమయంలో అర్జున్ ఒక క్రైమ్ లో ఇరుక్కుంటాడు. సెన్సేషనల్ న్యూస్ లు కవర్ చేసే అర్జున్ చివరికి సెన్సేషనల్ క్రైమ్ లో ఎలా నిందితుడు అయ్యాడు? ఈ ఫేక్ సర్టిఫికెట్ల కథాకమామీషు ఏంటి? ఈ బాగోతం నుండి అర్జున్ ఎలా బయటపడ్డాడు అన్నది మిగిలిన కథ.

నటీనటులు:
నిఖిల్ ఇప్పటికే ప్రొవెన్ ఆర్టిస్ట్. నటన పరంగా ఎప్పట్లానే కాన్ఫిడెంట్ గా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. డ్యాన్స్ అండ్ ఫైట్స్ విషయంలో ఈసారి ఆకట్టుకున్నాడు. లావణ్య త్రిపాఠి నటన గురించి పెద్దగా చెప్పుకునే అవకాశం రాలేదు. ఇందులో అసలు ప్రాముఖ్యత లేని పాత్ర దక్కింది. మెయిన్ విలన్ తరుణ్ అరోరా పర్వాలేదు. ఇక వెన్నెల కిషోర్, సత్య కామెడీ నవ్విస్తుంది. ఎమోషనల్ సీన్స్ లో పోసాని చెప్పే డైలాగులు బాగున్నాయి. మిగిలినవాళ్లంతా తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

సాంకేతిక వర్గం:
ముందుగా సామ్ సీఎస్ మ్యూజిక్ గురించి మాట్లాడుకోవాలి. సాంగ్స్ పరంగా యావరేజ్ ఆ నిలిచినా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదరగొట్టాడు. ఎలివేషన్స్ కు నేపధ్య సంగీతం బాగా ఉపయోగపడింది. కన్నె కన్నె సాంగ్ వినడానికి బాగుంది. తర్వాత ఆర్ట్ వర్క్ గురించి ప్రస్తావించుకోవాలి. లొకేషన్స్ అన్నీ పెర్ఫెక్ట్ గా కుదిరాయి. ఎడిటింగ్ నిరాశపరుస్తుంది. సినిమా సవ్యంగా సాగుతున్న ఫీల్ రాదు. అలాగే సినిమాటోగ్రఫీ కూడా జస్ట్ ఓకే. కొన్ని విజువల్స్ లో క్వాలిటీగా అనిపిస్తాయి. కథ కాంటెంపరరీది సెలక్ట్ చేసుకున్నారు. యూత్ కు కనెక్ట్ అయ్యే పాయింట్ ను ఎంచుకుని సగం పని పూర్తి చేసారు. అయితే మిగతా సగం పని దగ్గరే వచ్చింది ఇబ్బంది. స్క్రీన్ ప్లే స్ట్రక్చర్డ్ గా అనిపించదు. చాలా చోట్ల బోరింగ్ ఫీలింగ్ వస్తుంది. డైరెక్టర్ గా సంతోష్ జస్ట్ పాస్ మార్కులు వేయించుకుంటాడు.

విశ్లేషణ:
ఇందాక చెప్పినట్లు సినిమా పాయింట్ బాగుంది. సెన్సేషనల్ న్యూస్ ల కోసం ఎదురుచూసే జర్నలిస్ట్, తానే సెన్సేషనల్ న్యూస్ అవ్వడం.. అందరి కేసులను ఇన్వెస్టిగేట్ చేయాలనుకునే వ్యక్తికి, తన కేసు తనే ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావడం వినడానికి ఎగ్జిటింగ్ గా అనిపించి ఉండొచ్చు. అయితే ఈ సినిమాను నిజాయితీగా చెప్పే క్రమంలో విఫలమయ్యారు. అవసరం లేని హీరోయిజం సీన్లతో కథను పక్కదారి పట్టించారు. సినిమా నిడివి కూడా పెరిగింది. ఫస్ట్ హాఫ్ మొదటి 30 నిముషాలు పరమ బోరింగ్ గా సాగుతుంది. అయితే ఇంటర్వెల్ దగ్గర 40 మినిట్స్ మాత్రం ఆసక్తికరంగా మారి సెకండ్ హాఫ్ పై అంచనాలను పెంచేస్తుంది. మళ్ళీ అదే ప్రాబ్లెమ్. సెకండ్ హాఫ్ లో కూడా మొదటి 30 నిమిషాలు బోర్ కొట్టిస్తుంది. మధ్యలో గ్రాఫ్ కొంచెం పైకి లేపినా క్లైమాక్స్ అప్పటిదాకా వచ్చిన ఇంప్రెషన్ ను చంపేస్తుంది. పరమ రొటీన్ గా సాగుతుంది.

మొత్తంగా చూసుకుంటే అర్జున్ సురవరం ఒక ఆసక్తికర కథను అంతే ఆసక్తికరంగా చెప్పడంలో విఫలమైన కథ. ఒరిజినల్ ను డైరెక్ట్ చేసిన దర్శకుడే అయినా ఈ రీమేక్ ను అదే రేంజ్ లో తీయలేకపోయాడు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All