Sunday, August 14, 2022
Homeటాప్ స్టోరీస్అర్జున్ సురవరం ఆగిపోవడానికి ఆ గొడవలే కారణం : నిఖిల్

అర్జున్ సురవరం ఆగిపోవడానికి ఆ గొడవలే కారణం : నిఖిల్

అర్జున్ సురవరం ఆగిపోవడానికి ఆ గొడవలే కారణం : నిఖిల్
అర్జున్ సురవరం ఆగిపోవడానికి ఆ గొడవలే కారణం : నిఖిల్

యంగ్ హీరో నిఖిల్ హ్యాపీ డేస్ తో ఇండస్ట్రీకి పరిచయమై యువతతో వెంటనే హిట్ అందుకుని ప్రామిసింగ్ గా కనిపించాడు. అయితే ఆ తర్వాత వచ్చిన వరస ప్లాపులు నిఖిల్ కెరీర్ ను బాగా దెబ్బతీశాయి. వరసగా అరడజనుకుపైగా ప్లాపుల తర్వాత నిఖిల్ కెరీర్ మళ్ళీ స్వామి రారా సినిమాతో ట్రాక్ లో పడింది. ఆ తర్వాత కార్తికేయతో మరో హిట్. ఇలా మళ్ళీ హిట్ ట్రాక్ ఎక్కి ప్రామిసింగ్ కథలను ఎంచుకోవడం మొదలుపెట్టాడు. అయితే ఇటీవలే మళ్ళీ నిఖిల్ కెరీర్ కొంత గాడి తప్పినట్లు అనిపిస్తోంది. ఎన్నో ఆశలు పెట్టుకుని చేసిన కేశవ, కిరాక్ పార్టీ సినిమాలు నిరాశపరిచాయి. ఒక బర్నింగ్ ఇష్యూతో చేసిన అర్జున్ సురవరం సినిమాకు బోలెడన్ని కష్టాలు చుట్టుముట్టాయి. మొదట ముద్రగా తెరకెక్కడం, తర్వాత కొన్ని వివాదాల తర్వాత అర్జున్ సురవరంగా టైటిల్ మార్చడం వంటివి జరిగాయి. నిజానికి అర్జున్ సురవరం మొదట డిసెంబర్ 2018 లో విడుదలవ్వాలి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదాల మీద వాయిదాలు పడుతూ ఇప్పటిదాకా వచ్చింది. మొత్తానికి అర్జున్ సురవరం నవంబర్ 29న అంటే దాదాపు ఏడాది పాటు వాయిదా పడి విడుదలవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ లోని శ్రీరాములు థియేటర్ లో విడుదల చేయబోతున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా నిఖిల్ నిన్న రాత్రి ట్విట్టర్ ప్రశ్నల సెషన్ పెట్టాడు. అభిమానులు ఈ సినిమా గురించి నిఖిల్ పర్సనల్ లైఫ్ గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. అందులో ఒక ఫ్యాన్ అర్జున్ సురవరం వాయిదా పడటానికి గల కారణం చెప్పమని అడగగా.. దానికి నిఖిల్ అందరూ అనుకున్నట్లు ఈ సినిమా ఆర్ధిక పరమైన ఇబ్బందుల వల్ల ఆగిపోలేదు. ఒక చిన్న గొడవ వల్ల ఆగిపోయింది. అయితే ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది అని చెప్పాడు. మరో ప్రశ్నకు సమాధానంగా కార్తికేయ 2 నిజమైన సీక్వెల్ అని, కార్తికేయ ఎక్కడనుండి ఆగిపోయిందో అక్కడి నుండి కార్తికేయ 2 మొదలవుతుందని, డిసెంబర్ నుండి షూటింగ్ కు వెళుతున్నామని చెప్పాడు.

ఇక సంక్రాంతి సినిమాల్లో మీరు ఏ సినిమా గురించి ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అని అడగ్గా.. తెలివిగా సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఒకటెందుకు అన్నీ చూసేద్దాం అని సమాధానమిచ్చాడు. మీకు పవన్ కళ్యాణ్ సినిమాలో అవకాశమొచ్చి, మీ డేట్స్ ఖాళీ లేకపోతే ఏం చేస్తారు అని ప్రశ్నించగా.. ప్రస్తుతం ఉన్న డేట్స్ క్యాన్సిల్ చేసుకుని, నిర్మాతకు వచ్చిన లాస్ భరించి మరీ పవన్ సినిమాలో నటిస్తానని చెప్పాడు. మహేష్ గురించి స్పందిస్తూ మోస్ట్ హ్యాండ్సమ్ హీరోగా తెలిపాడు. ఇక అర్జున్ సురవరంలో వెన్నెల కిషోర్ రోల్ హైలైట్ అవుతుందని అంటున్నాడు నిఖిల్. బాలాజీ అనే పాత్రలో ఇరగదీశాడని చెబుతున్నాడు. ఇక అర్జున్ సురవరం స్టోరీ గురించి మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒక సమస్యను పాయింట్ గా తీసుకుని చేశామని ట్రైలర్ చూస్తే ఒక క్లారిటీ వస్తుందని అన్నాడు.

Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All

గాసిప్స్

View All

Latest Posts