HomePolitical Newsబ్రిటీష్‌ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందా!!

బ్రిటీష్‌ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందా!!

బ్రిటీష్‌ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందా!!
బ్రిటీష్‌ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందా!!

బ్రిటీష్‌ కాలంలో కట్టిన ఆనకట్టలకు కాలం చెల్లిందని అన్నారు ఏపీ జ‌ల వ‌న‌రుల‌శాఖ మంత్రి అంబటి రాంబాబు. ఆ ఆన‌క‌ట్ట‌ల స్థానంలో కొత్త బ్యారేజీలను కట్టి ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నామని అన్నారు. ఈ క్రమంలోనే సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీ పూర్తి చేశామన్నారు. YSRCP అధికారంలోకి వచ్చాకే బ్యారేజీ పనులను పూర్తి చేశామన్నారు.

బ్యారేజీలను చంద్రబాబే పూర్తి చేశారని చెప్పడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలని మంత్రి మండిపడ్డారు. 14 ఏళ్లు అధికారంలో ఉన్న చంద్రబాబు ఒక్క ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌నూ చేపట్టలేదన్నారు. ప్రాజెక్టులపై టీడీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తోంది. చేయని పనులను చేసినట్టు చెప్పుకుంటున్నారు. కనీసం రైతులకు నీళ్లు ఇవ్వాలనే ఆలోచన కూడా బాబు చేయలేదన్నారు.

- Advertisement -

ఇవాళ జరుగుతున్న ప్రాజెక్టులన్నీ దివంగత వైఎస్సార్‌ ప్రారంభించినవేనన్నారు.కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరంను తామే కడతామని చంద్రబాబు ప్రగల్భాలు పలికారు. కాఫర్‌ డ్యామ్‌ పూర్తి చేయకుండా డయాఫ్రం వాల్‌ ఎందుకు కట్టారో చెప్పాలి. పోలవరంపై ఏదో జరిగిపోతున్నట్లు పచ్చమీడియా రాస్తోంది. ప్రాజెక్టులు పూర్తికావద్దని ,పరిశ్రమలు రావొద్దని ఎల్లోమీడియా కుట్రలు పన్నుతోంది. బల్క్‌ డ్రగ్‌ పరిశ్రమపైనా దుష్ప్రచారం చేస్తున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు.

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All