Homeటాప్ స్టోరీస్నష్టాల్లో అరవింద సమేత బయ్యర్లు

నష్టాల్లో అరవింద సమేత బయ్యర్లు

Aravinda sametha buyers in loss zone అరవింద సమేత చిత్రానికి దసరా సెలవులు తోడూ కావడంతో భారీ ఓపెనింగ్స్ అయితే వచ్చాయి కానీ మొదటి వారం తర్వాత ఆ జోష్ తగ్గింది . దసరా సెలవులు అయిపోయాక మొత్తంగా అరవింద సమేత హడావుడి సద్దుమణిగింది . దాంతో ఈ సినిమాని కొన్న వాళ్ళలో ఒక్క దిల్ రాజు మాత్రం లాభాలు తెచ్చుకున్నాడు కానీ మిగతా ఏరియాల వాళ్ళు లాభాల్లోకి రావాలంటే మరో నాలుగు కోట్ల షేర్ రాబట్టాలి అరవింద సమేత చిత్రం . అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అరవింద సమేత నాలుగు కోట్ల షేర్ రాబట్టడం మాత్రం కష్టం గా మారింది . ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు జరిగిన బిజినెస్ దాదాపు 92 కోట్లు కాగా ఇప్పటివరకు వచ్చిన షేర్ 88 కోట్లు మాత్రమే అంటే ఇంకా నాలుగు కోట్ల షేర్ రాబట్టాలి .

తెలంగాణలో దిల్ రాజు కు లాభాలు రాగా రాయలసీమ , ఓవర్ సీస్ , ఉత్తరాంధ్ర , నెల్లూర్ , కృష్ణా , గుంటూరు , ఈస్ట్ , వెస్ట్ అన్ని చోట్లా పెట్టిన పెట్టుబడి తిరిగి వసూల్ చేసుకునే పనిలో పడ్డారు అయితే అంతగా వర్కౌట్ అయితే కావడం లేదు . సినిమా ఏది కూడా పోటీ లేదు కాబట్టి గుడ్డిలో మెల్ల లాగా కొంతమేరకైనా రాకపోతుందా అన్న ఆశలో ఉన్నారు బయ్యర్లు . 150 కోట్ల గ్రాస్ వసూళ్ళ ని సాధించిన అరవింద సమేత ఎన్టీఆర్ రేంజ్ ని పెంచింది కానీ బయ్యర్లు మాత్రం నష్టపోయేలా ఉన్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు , నాగబాబు , సునీల్ , ఈశా రెబ్బా లు కీలక పాత్రల్లో నటించారు .

- Advertisement -

English Title: Aravinda sametha buyers in loss zone

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All