Homeటాప్ స్టోరీస్అరవింద సమేత 10 రోజుల కలెక్షన్లు

అరవింద సమేత 10 రోజుల కలెక్షన్లు

Aravinda Sametha 10 days ap and ts Collectionsయంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత భారీ వసూళ్లు సాధిస్తూ దసరా బరిలో విజేతగా నిలిచిన విషయం తెలిసిందే . అక్టోబర్ 11 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన అరవింద సమేత మొత్తం పది రోజుల్లో 66 కోట్లకు పైగా షేర్ వసూల్ చేసింది . రెండు తెలుగు రాష్ట్రాలలోనే 66 కోట్లకు పైగా షేర్ రావడంతో బయ్యర్లు దాదాపుగా పెట్టిన పెట్టుబడి తెచ్చుకునారు . ఇక మిగిలింది లాభాలే ! అయితే ఓవర్ సీస్ లో మాత్రం అరవింద సమేత కొనుక్కున్న వాళ్ళకు లాభాలు వచ్చేలా కనిపించడం లేదు . ఓవర్ సీస్ విషయాన్నీ పక్కన పెడితే రెండు తెలుగు రాష్ట్రాలలో మాత్రం మంచి వసూళ్లు సాధిస్తున్నాడు ఎన్టీఆర్ . రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంతో వరుసగా అయిదో హిట్ అందుకున్నాడు ఎన్టీఆర్ . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే నటించగా ఇతర పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు , ఈశా రెబ్బా , సునీల్ లు నటించారు .

ఇక 10 రోజుల షేర్ ఏరియాల వారీగా ఎలా ఉందో చూద్దామా !
నైజాం – 19. 60 కోట్లు
సీడెడ్ – 15. 53 కోట్లు
వైజాగ్ – 7. 70 కోట్లు
ఈస్ట్ – 5. 14 కోట్లు
వెస్ట్ – 4. 43 కోట్లు
కృష్ణా – 4. 62 కోట్లు
గుంటూరు – 7. 49 కోట్లు
నెల్లూర్ – 2. 41 కోట్లు

- Advertisement -

మొత్తం – 66. 72 కోట్లు (షేర్ )

English Title:  Aravinda Sametha 10 days ap and ts Collections

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All