Homeట్రేడ్ న్యూస్ఏపీలో భీమ్లా నాయక్ థియేటర్స్ వద్ద CRPF బలగాలను దింపిన ప్రభుత్వం

ఏపీలో భీమ్లా నాయక్ థియేటర్స్ వద్ద CRPF బలగాలను దింపిన ప్రభుత్వం

వరల్డ్ వైడ్ గా భీమ్లా నాయక్ మేనియా నడుస్తుంటే…ఏపీలో మాత్రం జగన్ కక్ష్య సాధింపు చర్య కొనసాగుతుంది. గతంలో వకీల్ సాబ్ సినిమా రిలీజ్ సమయంలో ఎలాగైతే భారీ ఎత్తున థియేటర్స్ వద్ద రెవిన్యూ అధికారులను దింపడం తనికీలు చేయడం , అధిక ధరలకు టికెట్స్ అమ్మితే సీజ్ చేయడం వంటివి చేసి , థియేటర్ యాజమాన్యాలను భయబ్రాంతులకు గురి చేసారో..తాజాగా ఈరోజు భీమ్లా నాయక్ సందర్బంగా అలాగే చేస్తున్నారు. మొన్నటి వరకు ఎలాంటి తనిఖీలు కానీ ఆంక్షలు కానీ చేయని ప్రభుత్వం..ఇప్పుడు పవన్ ను దెబ్బతీసేందుకు తనికీలు చేయడం , పలు థియేటర్స్ ను సీజ్ చేయడం చేస్తున్నారు. అంతే కాదు భీమ్లా నాయక్ థియేటర్ ప్రదర్శిస్తున్న థియేటర్స్ వద్ద CRPF బలగాలను దింపి అభిమానులను కలవరపాటుకు గురిస్తున్నారు.

- Advertisement -

జగన్ ప్రభుత్వం తీసుకున్న కొత్త నిర్ణయాలతో దాదాపు శుక్రవారం రోజు అరవై థియేటర్లు క్లోజ్ అయినట్లుగా తెలుస్తోంది. ఒక్కో థియేటర్ దగ్గర ఇద్దరు లేదా నలుగురు రెవెన్యూ ఆఫీసర్లు కూడా డ్యూటీ చేస్తుండడం విశేషం. ఎక్కడ హడావుడి లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం మీద భీమ్లా నాయక్ కలెక్షన్లను దెబ్బ కొట్టాలని ప్లాన్ చేసిన ప్రభుత్వం..ఆ ప్లాన్ ను చక్కగా చేస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ మూల్యం చెల్లించుకుంటారని అభిమానులు అంటున్నారు.

ఏపీలో పరిస్థితి ఇలా ఉంటె తెలంగాణ లో మాత్రం అభిమానులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. సినిమా కు బ్లాక్ బస్టర్ హిట్ టాక్ రావడం , ఐదు షో లకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం తో కలెక్షన్ల వర్షం కురుస్తుంది.

YouTube video

- Advertisement -
Advertisement
Advertisement

టాప్ స్టోరీస్

View All
Advertisement

గాసిప్స్

View All